అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను నామినేట్ చేసింది డెమొక్రటిక్ పార్టీ. బుధవారం వర్చువల్‌గా జరిగిన డెమొక్రటిక్ పార్టీ జాతీయ సమావేశం ఇందుకు వేదికైంది. పార్టీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు కమల.
తొలిసారి ఈ పదవికి ఒక ప్రధాన పార్టీ నుంచి ఎంపికైన భారతీయ ఆఫ్రికన్‌గా నిలిచారు కమల. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచినట్లయితే.. అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్నారు.
జాత్యహంకారానికి వ్యాక్సిన్ లేదు: కమల
తొలి ఆఫ్రికన్-అమెరికన్, దక్షిణాసియా మహిళగా ఒక ప్రధాన పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కమల. అమెరికా కోసం ప్రాణాలర్పించిన ఆఫ్రికన్-అమెరికన్లను గుర్తు చేసుకున్నారు. జాత్యహంకారానికి టీకా లేదని పేర్కొన్నారు. సమ న్యాయమే ప్రధాన అజెండాగా తమ పార్టీ పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: బైడెన్‌ను అధికారికంగా నామినేట్ చేసిన డెమొక్రటిక్ పార్టీ