భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. 71 శాతం ఓట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్పై విజయం సాధించారు.
దిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి.. 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.
వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్ మూడోసారి విజయం సాధించారు.
కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి గెలుపుపై అమీబిరా ఆశలు పెట్టుకున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విల్లూరుతున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్-బైడెన్ భవితవ్యం నిర్ణయించే రాష్ట్రాలు ఇవే..