ETV Bharat / international

శ్వేతసౌధం సీనియర్​ సలహాదారుగా నీరా టాండన్​ - శ్వేతసౌధం సీనియర్​ సలహాదారు నీరా టాండెన్​

శ్వేతసౌధం సీనియర్​ సలహాదారుగా భారతీయ అమెరికన్ నీరా టాండన్​ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది.

White House senior adviser, నీరా టాండెన్
నీరా టాండెన్
author img

By

Published : May 15, 2021, 7:44 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కేబినెట్​లో కీలక పదవికి నామినేషన్​ దాఖలు చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్న భారతీయ అమెరికన్​ నీరా టాండన్​.. తాజాగా శ్వేతసౌధం సీనియర్​ సలహాదారుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది.

సీనియర్​ సలహాదారుగా బాధ్యతలు చేపట్టగానే యూఎస్​ డిజిటల్​ సర్వీస్​పై సమీక్ష నిర్వహించడం సహా దేశంలోని 'అఫోర్డబుల్​ కేర్​ యాక్ట్​' సవరణకు సంబంధించి టాండన్​ కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా హయాంలో రూపొందించిన ఈ చట్టం రూపకల్పన, అమలులో నీరా కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం నీరా టాండన్​.. సెంటర్​ ఫర్​ అమెరికన్​ ప్రొగ్రెస్​ సంస్థకు అధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నారు. శ్వేతసౌధం సీనియర్​ సలహాదారుగా ఎంపికైన నేపథ్యంలో ఈ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : అమెరికాలో ఇక మాస్క్​ లేకుండా తిరగొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.