ETV Bharat / international

అమెరికాలో మన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం - అమెరికాలో మన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం

కరోనా కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు అండగా నిలిచారు భారతీయ-అమెరికన్ల వసతి గృహాల యజమానులు. లాక్​డౌన్​ వేళ నివాసం కోల్పోయినవారికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

indian-american-hoteliers-offer-free-accommodation-to-stranded-indian-students
అమెరికాలో మన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం
author img

By

Published : Mar 26, 2020, 8:47 PM IST

కరోనా వైరస్​తో ప్రపంచం స్తంభించింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనాపై పోరులో అటు అమెరికా తీవ్ర చర్యలు చేపట్టడం.. ఇటు భారత్​లో లాక్​డౌన్​ కొనసాగుతుండటం వల్ల అక్కడి భారతీయ విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ-అమెరికన్లు వారికి అండగా నిలుస్తున్నారు. తమ హొటళ్లలో వారికి ఉచితంగా వసతి, భోజనం అందిస్తున్నారు.

మొత్తంగా 2 లక్షల 50 వేల మంది విద్యార్థులకు.. దాదాపు 700 హోటళ్లలోని 6 వేల గదులు కేటాయించారు. ఇదంతా అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన ఒక ఫోన్​ కాల్​తో సాధ్యపడింది.

ఆపన్న హస్తం

మార్చి 22న అనేక మంది భారతీయ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని అధికారులు అదేశాలు జారీ చేశారు. దీని వల్ల 2లక్షల 50వేల వసతి కోసం ఎదురుచూశారు. ఏషియన్​ అమెరికన్​ హొటల్​ ఓనర్స్​ అసోసియేషన్​(ఏఏహెఓఏ) పిలుపుతో యజమానులు భారీ సంఖ్యలో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తొలుత విద్యార్థుల నుంచి రోజుకు 20-25 డాలర్లు వసూలు చేయాలనుకున్నారు. కానీ యజమానుల్లో కొందరు ఉచితంగా వసతి, భోజనం ఇవ్వడం చూసి.. మిగిలిన వారూ ఛార్జీల ఆలోచనను విరమించుకున్నారు.

ఇప్పటివరకు అమెరికాలో కరోనా వైరస్​ సోకి 1,031 మంది మరణించగా... 68 వేల 572 వైరస్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి : 'కరోనా చికిత్సకు 69 ఔషధాలు గుర్తింపు!'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.