ETV Bharat / international

'మన బంధానికి గాంధీ- కింగ్​ల వారసత్వమే నిదర్శనం' - అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు

భారత్​ అమెరికాల మధ్య బలమైన సంబంధాలకు మహాత్మ గాంధీ- మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​ వంటి గొప్ప నేతల వారసత్వమే బలమైన పునాదిగా ఉందన్నారు చికాగోలో భారత కాన్సుల్ జనరల్ అమిత్ కుమార్. 'గాంధీ-కింగ్​ల వారసత్వం' మొదటి రౌండ్ టేబుల్ సమ్మిట్​లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

India-US ties greatest testament to Gandhi-King legacy, says Indian diplomat
భారత్-అమెరికాల మధ్య గాంధీ-మార్టీన్​ లూథర్​ కింగ్​ల వారసత్వం
author img

By

Published : Mar 3, 2021, 9:10 AM IST

భారత్​ అమెరికాల మధ్య ప్రస్తుతమున్న బలమైన సంబంధాలకు మహాత్మ గాంధీ- మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​ల వారసత్వం గొప్ప నిదర్శనమని చికాగోలో భారత కాన్సుల్ జనరల్ అమిత్ కుమార్ అభిప్రాయపడ్డారు. గాంధీ-కింగ్ లెగసీ(గాంధీ-కింగ్​ల వారసత్వం) మొదటి రౌండ్ టేబుల్ సమ్మిట్​లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఆసియా కుటుంబం(మెట్రోపాలిటన్ ఏషియన్ ఫ్యామిలీ) సేవల సహకారంతో ఫిబ్రవరి 26న కాంగ్రెస్ మల్టీ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ గాంధీ-కింగ్​ లెగసీ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.

భారత్​.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. అమెరికా.. పురాతన ప్రజాస్వామ్యం దేశం. ఈ రెండు దేశాల మధ్య ఉన్నత సంబంధాలు గాంధీ-కింగ్ వారసత్వానికి గొప్ప నిదర్శనం.

-అమిత్​​ కుమార్, భారత కాన్సుల్ జనరల్, చికాగో

భారతదేశం రూపొందించిన కరోనా టీకాలు ప్రపంచ దేశాలకు సరఫరా చేయడం.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు అద్భుత ఉదాహరణ అని అమిత్​ కుమార్​ అభిప్రాయపడ్డారు.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.. గాంధీ శిష్యుడని.. ఆయన బోధనలను ఆచరించారని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డానీ కే.డేవిస్ గుర్తుచేశారు.

ఇదీ చదవండి: వైట్​హౌస్​ మిలటరీ ఆఫీస్​​ డైరెక్టర్​గా భారతీయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.