అత్యాధునిక డ్రోన్ల అభివృద్ధికి భారత్-అమెరికా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇండియా ఐడియాస్ సదస్సులో అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్‌కు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు.
"వాయు మార్గంలో ప్రయోగించే యూఏవీ(అన్మానెడ్ ఏరియల్ వెహికిల్)ని అభివృద్ధి చేసేందుకు అమెరికా-భారత్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అమెరికా వాయుసేనకు చెందిన ఓ పరిశోధన ల్యాబ్.. భారత్ వాయుసేన, భారత రక్షణ-పరిశోధన సంస్థ, భారత్‌కు చెందిన ఓ అంకుర సంస్థ కలిసి ఈ డ్రోన్లను అభివృద్ధి చేస్తాయి."
-- ఎల్లన్ లార్డ్, పెంటగాన్ అధికారి.
సెప్టెంబర్ 14న అమెరికా- భారత్ డీటీటీఐ(యూఎస్-ఇండియా డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్) సమావేశం జరుగుతుందని లార్డ్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించారు. దీని వల్ల ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో మరింత స్థిరత్వం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.