2023లో జరిగే జీ-20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు సౌదీ అరేబియా అధ్యక్షత జరిగిన ప్రస్తుత సదస్సు ముగింపు కార్యక్రమంలో సభ్య దేశాలు ఆదివారం ప్రకటించాయి.
"రియాద్ సదస్సులో అందించిన ఆతిథ్యానికి, జీ-20 ప్రక్రియలో భాగస్వామ్యానికి సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు. 2021లో ఇటలీ, 2022లో ఇండోనేసియా, 2023లో భారత్, 2024లో బ్రెజిల్లో జరగబోయే సదస్సులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."
- జీ-20 సభ్య దేశాల తీర్మానం
ఇటలీ, ఇండోనేసియా సదస్సుల తర్వాత 2023లో జీ-20 ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి 2022లోనే భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉందని, దానిని 2023కు మార్చినట్లు వెల్లడించాయి. అధ్యక్ష హోదా క్రమాన్ని సభ్య దేశాల సంప్రదింపులు, పరస్పర సహకారం ఆధారంగా నిర్ణయిస్తారని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: 'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'