ETV Bharat / international

సైబరాసురులపై సమరం.. సాధ్యమేనా?

కంపెనీలకు, ప్రభుత్వాలకు ముందుజాగ్రత్త ముఖ్యమని ర్యాన్సమ్‌వేర్‌ దాడులు హెచ్చరిస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది 67శాతం కంపెనీలు డబ్బు ముట్టజెప్పి తమ డేటాను తిరిగి పొందాయని సోఫోస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సైబర్‌ దాడులను తట్టుకోవడం తమ ఐటీ సిబ్బందికి కష్టమవుతోందని 86శాతం భారతీయ కంపెనీలు చెప్పాయి. దీన్నిబట్టి ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయ శాఖల తరహాలో భారతదేశమూ సైబర్‌ భద్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అర్థమవుతోంది.

author img

By

Published : Jun 13, 2021, 7:16 AM IST

ransomware on indi
ర్యాన్సమ్‌వేర్‌ దాడులు

ముల్లును ముల్లుతోనే తీయడంలో అమెరికా నేర పరిశోధక సంస్థ (ఎఫ్‌బీఐ) ఆరితేరింది. ఇటీవల ర్యాన్సమ్‌ వేర్‌ దాడితో కొలోనియల్‌ పైప్‌లైన్‌ సంస్థ నుంచి సైబర్‌ నేరగాళ్లు గుంజుకున్న డబ్బులో పెద్ద మొత్తాన్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. ఆ తరవాత కొద్ది రోజులకే ఆపరేషన్‌ ట్రోజన్‌షీల్డ్‌ పేరిట 16 దేశాల్లో 800 మంది సంఘటిత నేరగాళ్లను అరెస్టు చేసింది. సైబర్‌ ఎదురుదాడి ద్వారా కేటుగాళ్ల ఆటకట్టించడంలో ఎఫ్‌బీఐ విశేష చాతుర్యం ప్రదర్శించింది. ఆపరేషన్‌ ట్రోజన్‌షీల్డ్‌ కింద ఎనామ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్స్‌ అనే బోగస్‌ కంపెనీని నెలకొల్పి, దాని ద్వారా 100 దేశాల్లో 300 సంఘటిత నేరగాళ్ల ముఠాలకు ఎన్‌క్రిప్టెడ్‌ ఫోన్లు, సంబంధిత పరికరాలను చేరవేసింది. ఎనామ్‌ ఫోన్లతో జరిగే సంభాషణలను ప్రభుత్వ సంస్థలు ఆలకించలేవని కొందరు నేరగాళ్లను నమ్మించి, వారి చేతులతోనే సహచరులకు ఆ ఫోన్లను బట్వాడా చేయించింది. వాటి ద్వారా నేరగాళ్లు పంపుకొన్న 2.7 కోట్ల సందేశాలు, ఫొటోలను ఓ కంట కనిపెట్టింది. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఐకి ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల భద్రతా సంస్థలు సహకరించాయి. ఫలితంగా దాదాపు 150 హత్యలను, మాదకద్రవ్య అక్రమ రవాణానూ నివారించగలిగారు. 250 ఆయుధాలను, 4.8 కోట్ల డాలర్ల నగదునూ స్వాధీనం చేసుకున్నారు. నేరగాళ్లకు సహకరించే అవినీతిపరులైన ప్రభుత్వాధికారులనూ గుర్తించగలిగారు.

ర్యాన్సమ్‌వేర్‌ ముప్పు

ఆపరేషన్‌ ట్రోజన్‌షీల్డ్‌కంటే ముందు సైబర్‌ నేరగాళ్లపై ఎఫ్‌బీఐ సాధించిన విజయమూ అందరి దృష్టినీ ఆకర్షించింది. కొలోనియల్‌ పైప్‌లైన్‌ సంస్థ నుంచి 44 లక్షల డాలర్ల డబ్బు గుంజుకున్న సైబర్‌ కేటుగాళ్ల నుంచి కేవలం నెల రోజుల్లోనే 23 లక్షల డాలర్ల విలువైన 63.7 బిట్‌ కాయిన్లను ఎఫ్‌బీఐ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఈ వార్త వెలువడిన రోజున బిట్‌ కాయిన్‌ విలువ పది శాతం పడిపోయింది. అమెరికా న్యాయ శాఖ ఏప్రిల్‌లో డిజిటల్‌ బలవంతపు వసూళ్ల నిరోధక విభాగాన్ని ఏర్పరచిన కొద్ది వారాలకే ఎఫ్‌బీఐ ఈ విజయం సాధించింది. మే నెలలో డార్క్‌సైడ్‌ అనే సైబర్‌ నేరగాళ్ల ముఠా కొలోనియల్‌ పైప్‌లైన్‌ సంస్థ సర్వర్లపై ర్యాన్సమ్‌ వేర్‌ ప్రయోగించింది. దాంతో కంపెనీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

అమెరికా నైరుతి ప్రాంతంలో ఆ సంస్థ చమురు, గ్యాస్‌ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. చివరకు కొలోనియల్‌ కంపెనీ డార్క్‌సైడ్‌ ముఠా కోరిన మొత్తాన్ని ముట్టజెప్పి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించగలిగింది. నేరగాళ్లతో మంతనాలు జరుపుతున్న సమయంలోనే కొలోనియల్‌ అధికారులు ఎఫ్‌బీఐని గుట్టుగా సంప్రదించడం పెద్ద మేలు చేసింది. డార్క్‌సైడ్‌ అనేది రష్యానుంచి పనిచేస్తున్న సైబర్‌ నేరగాళ్ల ముఠా. సర్వర్లను స్తంభింపజేసి డబ్బు దండుకోవడానికి ఉపకరించే ర్యాన్సమ్‌ వేర్‌ను వివిధ దేశాల్లోని సైబర్‌ నేరస్థులకు అది అందిస్తూ ఉంటుంది. బిట్‌కాయిన్ల రూపంలోని ధనాన్ని డార్క్‌సైడ్‌ నుంచి ఎఫ్‌బీఐ ఎలా స్వాధీనం చేసుకొన్నదో తెలియక సాంకేతిక నిపుణులు తల గోక్కుంటున్నారు! నేరగాళ్ల బిట్‌ కాయిన్‌ చిరునామాను తెరచి నగదు తీసుకోవడానికి తోడ్పడే వ్యక్తిగత డిజిటల్‌ తాళం చెవి(పాస్‌వర్డ్‌)ని ఎఫ్‌బీఐ సంపాదించి ఉండవచ్చునంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇతరులకు అనుమానం రాకుండా చూసుకోవడానికి తమ బిట్‌కాయిన్లను వేర్వేరు చిరునామాలకు పంపడం, తిరిగి తీసుకోవడం చేస్తుంటారు. బ్లాక్‌చెయిన్‌ ఎక్స్‌ప్లోరర్‌ సాయంతో ఎఫ్‌బీఐ వీరి కార్యకలాపాలను పసిగట్టి డబ్బు చేజిక్కించుకొని ఉండవచ్చు. డార్క్‌సైడ్‌లో ఉన్న ఎఫ్‌బీఐ గూఢచారులైనా పాస్‌వర్డ్‌ను అందించి ఉండవచ్చు.

ఏదిఏమైనా కొలోనియల్‌ కంపెనీ అజాగ్రత్త వల్లనే దాని పాస్‌వర్డ్‌ను డార్క్‌సైడ్‌ ముఠా సంపాదించి సర్వర్లలోకి చొరబడగలిగింది. ఈ కంపెనీ పలు అంచెల ధ్రువీకరణ పద్ధతి పాటించని పాత వీపీఎన్‌ వ్యవస్థను వినియోగిస్తోంది. ఈ వీపీఎన్‌ ఒకే ఒక పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తుంది. దాన్ని చేజిక్కించుకోవడం ద్వారా డార్క్‌సైడ్‌ ర్యాన్సమ్‌ వేర్‌ను ప్రయోగించగలిగింది. ఇటీవలి కాలంలో అమెరికాలో సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ శాఖలు, విద్యాలయాలు, ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థల కంప్యూటర్‌ సర్వర్లపైనా దాడులు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద మాంసం శుద్ధి పరిశ్రమ అయిన జేెబీఎస్‌ పైనా హ్యాకర్లు దాడి చేసి, సంస్థ కార్యకలాపాలను స్తంభింపజేశారు. వ్యాపారం తిరిగి ప్రారంభించడానికి వారికి జేబీఎస్‌ 1.1 కోట్ల డాలర్లు (రూ.80 కోట్లు) ముట్టజెప్పాల్సి వచ్చింది. మరోవైపు, జపాన్‌ సంస్థ ఫ్యూజీఫిల్మ్‌ హ్యాకర్ల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్లనే వారికి ఎదురొడ్డి నిలిచింది. జూన్‌ ఒకటో తేదీన ఫ్యూజి కంపెనీ సర్వర్లపై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. బ్యాకప్‌ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నందున ఆ సంస్థ నేరగాళ్లకు పైసా ముట్టజెప్పకుండా తన కార్యకలాపాలను కొనసాగించింది.

రక్షణ లేని భారతీయ కంపెనీలు

కంపెనీలకు, ప్రభుత్వాలకు ముందుజాగ్రత్త ముఖ్యమని ర్యాన్సమ్‌వేర్‌ దాడులు హెచ్చరిస్తున్నాయి. ఈ సందర్భంగా భారతదేశ చేదు అనుభవాలను పరిశీలించాలి. ర్యాన్సమ్‌వేర్‌ దాడులకు అత్యధికంగా గురవుతున్నది భారతదేశమే! ప్రపంచవ్యాప్తంగా 32శాతం కంపెనీలు ర్యాన్సమ్‌వేర్‌ నేరగాళ్లకు డబ్బు ముట్టజెప్పి తమ డేటాను తిరిగి సంపాదించుకుంటే, భారత్‌లో ఈ ఏడాది 67శాతం కంపెనీలకు ఆ దుర్గతి పట్టిందని సోఫోస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. సైబర్‌ దాడులను తట్టుకోవడం తమ ఐటీ సిబ్బందికి కష్టమవుతోందని 86శాతం భారతీయ కంపెనీలు చెప్పాయి. దీన్నిబట్టి ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయ శాఖల మాదిరిగా భారతదేశమూ సైబర్‌ భద్రతపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అర్థమవుతోంది. భారత్‌లో ప్రభుత్వ నెట్‌వర్కులూ ప్రైవేటు నెట్‌వర్కుల్లానే పదేపదే సైబర్‌ దాడులకు గురవుతున్నాయి. సైబర్‌ దాడుల నివారణకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి ప్రభుత్వ, పైవేటు సంస్థల మధ్య నిరంతరం సంప్రదింపులు జరగకపోవడం పెద్ద లోపం. తక్షణం దీని మీద దృష్టి సారించి మన సైబర్‌ భద్రతను పటిష్ఠం చేసుకోవాలి. మరోవైపు, సైబర్‌ సీమలో ఉగ్రవాదుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి భారత్‌, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం రాబోయే రోజుల్లో ఇంకా బలపడనుంది.

ఆర్థికాభివృద్ధికి ఆటంకం..

కొవిడ్‌ కాలంలో సైబర్‌ దాడులూ పేట్రేగుతున్నాయి. సైబర్‌ దాడుల వల్ల నిరుడు ప్రపంచానికి ఆరు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని జాతీయ సైబర్‌ సమన్వయ కేంద్రం అధిపతి రాజేశ్‌ పంత్‌ ప్రకటించారు. ప్రత్యర్థులు సైబర్‌ దాడులతో మన ఆర్థికాభివృద్ధిని మందగింపజేయడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించారు. మున్ముందు పాశ్చాత్య దేశాలు, చైనా విడివిడిగా ఇంటర్నెట్‌ వ్యవస్థలను నడుపుకోవచ్చునని, దానివల్ల సైబర్‌ నేరాలను అరికట్టడం మరింత కష్టమవుతుందని అన్నారు. ప్రస్తుతం మన త్రివిధ సాయుధ బలగాల్లో సైబర్‌ భద్రతా విధులను తొమ్మిది సంస్థలు నిర్వహిస్తున్నాయని పంత్‌ వెల్లడించారు.

- ఆర్య

ఇవీ చదవండి: 'డేటా సేకరణ'పై 129 యాప్​లకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.