భారత్- అమెరికా దేశాలు చైనా నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అగ్రరాజ్య జాతీయ భద్రత- విదేశీ విధానాల నిపుణులు ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. భారత్.. శక్తివంతమైన స్థితిలో ఉందని, ఇదే కొనసాగిస్తూ చైనాతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు.
మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవిని చేపట్టబోయే జో బైడెన్.. తన విదేశాంగశాఖ మంత్రిగా బ్లింకెన్‌ను ఎంపిక చేశారు.
మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు సంధించారు బ్లింకెన్. మిత్రదేశాలను బలహీనపరిచి.. చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకునేందుకు ట్రంప్ సహాయం చేశారని ఆరోపించారు.
"చైనా వైఖరితో భారత్-అమెరికాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో దూకుడుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తన ఆర్థిక బలాన్ని చూసుకుని ఇతర దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఇక్కడ మనల్ని మనం బలమైన స్థితిలో నిలుపుకోవాలి. మనం చెప్పినట్టు చైనా వినేలా బంధాన్ని ముందుకు సాగించాలి. చైనా చెప్పింది మనం వినకూడదు."
--- బ్లింకెన్, అమెరికా జాతీయ భద్రత నిపుణులు.
జో బైడెన్ నేతృత్వంలో భారత్-అమెరికా మైత్రి మరింత బలపడుతుందని బ్లింకెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బైడెన్‌ను ఛాంపియన్‌గా అభివర్ణించారు బ్లింకెన్.
ఇదీ చూడండి:- తెలుగు వైద్యుడికి బ్రిటన్ ఉన్నత పురస్కారం