ETV Bharat / international

'భారత్-​ అమెరికా ద్వైపాక్షిక బంధం బలమైనది' - blinken on india america relations

బైడెన్ యంత్రాంగంలో కీలక స్థానం దక్కించుకున్న టోనీ బ్లింకన్..​ భారత్- అమెరికా ద్వైపాక్షిక బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

India has been a bipartisan success story, says Blinken
'భారత్ అమెరికాకు ద్వైపాక్షిక విజయ గాథ'
author img

By

Published : Jan 20, 2021, 1:35 PM IST

భారత్- అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని బైడెన్​ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టోనీ బ్లింకన్ పేర్కొన్నారు. బైడెన్​ యంత్రాంగంలో ఆయన నియామకం సందర్భంగా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీతో మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లింకన్​ ఒబామా హయాంలో విదేశాంగ మంత్రిగా.. బైడెన్​ ఉపాధ్యక్షతన జాతీయ భద్రత సలహాదారుగా సేవలు అందించారు.

భారత్​తో బంధం బిల్​ క్లింటన్​ హాయం ముగిసే నాటికి బలపడింది. ఒబామా అధికారంలో ఉండగా రక్షణ, సమాచారం విభాగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం మెరుగైంది. అదే ట్రంప్ హయాంలో కూడా కొనసాగింది. ఇందుకు అదనంగా ఇండో పసిఫిక్ అంశంపై కూడా ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయి. ఈ బంధం మరింత బలపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

-టోనీ బ్లింకన్

భారత్​కు అనుకూలం..

టోనీ బ్లింకన్​ ఇదివరకు కూడా భారత్​కు అనుకూలంగానే వ్యవహరించారు. భారత్​తో దౌత్య సంబంధాలు బలోపేతం చేయడంలో బైడెన్ కీలకంగా నిలిచారని తెలిపారు. 2020 నాటికి భారత్​, అమెరికా ప్రపంచంలో అత్యంత సన్నిహితమైన దేశాలుగా అవ్వాలని బైడెన్ ఉపాధ్యక్షుడి హోదాలో ఆకాంక్షించేవారని తెలిపారు టోనీ.

ఇదీ చదవండి : బైడెన్​ జట్టులో భారత్​కు ఆప్తులు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.