కొవిడ్ మహమ్మారి వ్యాప్తి అంతమైనా ఆన్లైన్ విద్యావిధానం కొనసాగుతుందని గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఈ విద్యావిధానం ద్వారా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.
కొవిడ్-19 ఉద్ధృతి దృష్ట్యా వర్చువల్ తరగతుల నిర్వహణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ 50 కొత్త సాఫ్ట్వేర్ టూల్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా గతేడాది నుంచే లెర్నింగ్, విద్య అంశాలపై తమ సంస్థ పూర్తిగా శ్రద్ధ వహిస్తోందని సుందర్ పిచాయ్ తెలిపారు. లెర్నింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచ సమాచారాన్ని మొత్తం సేకరించి అది అందరికీ అందుబాటులో ఉంచేలా చేయడమే గూగుల్ లక్ష్యమని పేర్కొన్నారు.
170 మిలియన్ల మంది...
మొత్తంగా ఎడ్యుకేషన్ కోసం 170 మిలియన్ల మంది గూగుల్ వర్క్‌స్పేస్‌ను వినియోగిస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. 2020 జూన్‌లో ఎడ్యుకేషన్ కోసం 140 మిలియన్ల మంది 'జీ సూట్'ను ఉపయోగించారని తెలిపింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరగడంపై హర్షం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:'చైనా అలా ఉంటే.. దౌత్యబంధం కష్టమే'