అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్‌తో సంభాషించారు. చైనా అనైతిక ఆర్థిక విధానాలు, హాంకాంగ్‌లో అణచివేతలు, షిన్జియాంగ్లో మానవహక్కుల ఉల్లంఘనలు వంటి కీలకాంశాలను బైడెన్ ప్రస్తావించినట్లు శ్వేతసౌధం తెలిపింది. కరోనాను ఎదుర్కోవడం, ప్రపంచ ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పు సహా పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొంది.
చైనా నుంచి ఎదురువుతున్న సవాళ్లను అధిగమించడానికి బైడెన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే వీరి మధ్య ఫోన్ సంభాషణ సాగడం గమనార్హం.
బైడెన్... చైనా ప్రజలు జరుపుకునే లునార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారంపై మాట్లాడుకున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.