ETV Bharat / international

ఇండో-పసిఫిక్ దేశాధినేతలతో బైడెన్ కీలక చర్చలు - కొవిడ్ 19 పై పోరులో మూన్​ జే ఇన్​కు బైడెన్ అభినంధనలు

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత, సుసంపన్న వాతావరణాన్ని కొనసాగించాలని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఉద్ఘాటించారు. ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు, దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఈమేరకు ఫోన్​లో చర్చలు జరిపారు.

Joe Biden Phone calls with Indo Pacific leaders
ఇండో పసిఫిక్ దేశాధినేతలతో బైడెన్ ఫోన్ సంభాషణ
author img

By

Published : Nov 12, 2020, 12:56 PM IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా అధినేతలతో ఫోన్​ సంభాషణ జరిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత, సుసంపన్న వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో బుధవారం ఫోన్లో మాట్లాడారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విషయం సాధించిన బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయా దేశాధినేతలు చేసిన ఈ ఫోన్​ కాల్స్​లో వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి.

ఆస్ట్రేలియాతో సత్సంబంధాలు..

ఆస్ట్రేలియాతో అమెరికాకు చాలా కాలంగా సత్సంబంధాలున్నట్లు బైడెన్​ స్కాట్ మోరిస​న్​తో చెప్పుకొచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. కొవిడ్ 19 సహా ఆరోగ్య సంబంధిత ఇతర సవాళ్లను ఎదుర్కొనే విషయంలో మోరిసన్​తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు బైడెన్.

రక్షణ ఒప్పందాలు మరింత బలోపేతం..

జపాన్ ప్రధానితో జరిగిన సంభాషణలో.. స్థిరమైన ప్రభుత్వాన్ని నడిడిపిస్తున్న సుగాకు అభినందనలు తెలిపారు బైడెన్. ఆర్టికల్ 5 కింద మరిన్ని ప్రాంతాల్లో అమెరికా-జపాన్​ రక్షణ ఒప్పందాలను బలోపేతం చేయాలన్న తన ఆకాంక్షను వెల్లడించారు.

కొవిడ్ 19 పోరులో మూన్​కు అభినంధనలు..

అమెరికా-దక్షిణ కొరియా మధ్య రక్షణ ఒప్పందాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో బైడెన్ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడంలో మూన్​ న్యాయకత్వాన్ని బైడెన్ అభినందించారు. కొవిడ్ సహా.. వాతావరణ మార్పులు ఇతర అంశాల్లో ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:అలస్కాలో ట్రంప్​ విజయం- జార్జియాలో రీకౌంటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.