ETV Bharat / international

కరోనా 'నిశ్శబ్ద' యుద్ధం.. లక్షణాలు లేకుండానే వ్యాప్తి​! - covid latest news

కరోనా ఇప్పడు లక్షణాలు కనిపించకుండా సోకుతోంది. వైరస్​ సోకిందన్న సంగతే తెలీకుండా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తూ కలవరపెడుతోంది. అందుకే ఈ నిశ్శబ్ద వ్యాప్తి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారు. ఆ పరిశోధనలో తేలిందేమింటంటే...

IMPACT OF  ASYMPTOMATIC SPREAD OF CORONA VIRUS
లక్షణాలు కనిపించని వ్యాప్తి​ ప్రభావం ఎంత?
author img

By

Published : May 14, 2020, 10:49 AM IST

లక్షణాలు బయటికి కనిపించకుండా సాగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం చేశారు. 'కరోనా లాంటి వైరస్‌లు చాపకింద నీరులా వ్యాపించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నాయా..' అనే అంశాన్ని వారు పరిశీలించారు. వివరాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి.

"లక్షణాలు లేకుండా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు రోగానికి లాభం చేకూరుస్తోంది. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ కొత్త రకాలను పెంచుకుంటున్న వైరస్‌తో రోగ వ్యాప్తి సైతం పెరుగుతోంది. అయితే... ఆయా దేశాల్లో దీన్ని నియంత్రించేందుకు అనుసరిస్తున్న పద్ధతులు, క్వారంటైన్‌ సాగుతున్న తీరు, పరీక్షల సంఖ్య, కాంటాక్టులను కనుగొనడంపైనే మహమ్మారి ఎంతకాలం మనగలుగుతుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది" అని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రయాన్‌ గ్రెన్‌ఫెల్‌ చెప్పారు.

ఇదీ చదవండి:కరోనాతో సహజీవనం అంటే ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.