ETV Bharat / international

ఆ ఒంటెల ప్లాస్మాతో కరోనా​కు చికిత్స! - కరోనా వైరస్ చికిత్స

దక్షిణ అమెరికాలో కనిపించే 'లామా' ఒంటెల్లోని రోగ నిరోధక వ్యవస్థ కరోనా వైరస్​ను కట్టడి చేయగలదని పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఉత్పత్తి అయ్యే రెండు రకాల యాంటీబాడీలను అనుసంధానం చేయటం వల్ల వచ్చే సరికొత్త నిర్మాణం.. వైరస్ ప్రోటీన్​ నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ఆతిథ్య కణంలోకి వైరస్ ప్రవేశించలేదని అంటున్నారు.

Illama
లామాల రోగ నిరోధక వ్యవస్థ
author img

By

Published : Apr 30, 2020, 2:48 PM IST

దక్షిణ అమెరికా క్షీరదాలు లామాల రోగ నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీల నిర్మాణంతో ఆతిథ్య కణాల్లోకి కరోనా వైరస్​ ప్రవేశాన్ని నిరోధించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఈ పద్ధతి కొవిడ్​- 19 చికిత్సకు సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

అమెరికా టెక్సాస్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనం 'జర్నల్​ సెల్'​లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో లామా రోగనిరోధక వ్యవస్థలో రెండు ప్రత్యేక యాంటీబాడీలను నమూనాలను అనుసంధానించారు.

ప్రోటీన్ నిర్మాణం లక్ష్యంగా..

కరోనా వైరస్​పైన ఉండే ప్రోటీన్ నిర్మాణం 'స్పైక్'ను​ గట్టిగా పట్టి ఉంచే సరికొత్త వ్యవస్థను ఇది నిర్మిస్తుందని గుర్తించారు. ఈ నిర్మాణం సాయంతోనే శరీర కణాల్లోకి వైరస్​ ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ సరికొత్త యాంటీబాడీలు వైరస్​ను కణాల్లోకి చేరకుండా నియంత్రిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

"సార్స్-కోవ్-2 వైరస్​ను తటస్థీకరించే మొదటి యాంటీబాడీలు ఇవే. ప్రస్తుతం జంతువులపై క్లినికల్​ ట్రయల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాం. యాంటీబాడీ చికిత్సతో నేరుగా రోగనిరోధక శక్తి లభిస్తుంది. చికిత్స తర్వాత వారికి రక్షణ ఉంటుంది. ఇప్పటికే అనారోగ్యం పాలైన వారిని కూడా ఈ విధానంలో చికిత్స చేయవచ్చు. "

-మెక్​లెల్లన్​, పరిశోధకుడు

వ్యాక్సిన్లకు స్పందించని వృద్ధుల్లో చికిత్సకు ఈ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పద్ధతి ఎందుకు?

లామాలు రోగనిరోధక వ్యవస్థ మానవుల్లో పోలి ఉండే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైనా బ్యాక్టీరియా, వైరస్​లు లామాల శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాని రోగ నిరోధక వ్యవస్థ రెండు రకాలు యాంటీబాడీలను ఉత్పిత్తి చేస్తుంది.

ఇందులో ఒక రకం మానవుల యాంటీబాడీలను పోలి ఉంటుంది. మరొకటి అందులో పావు వంతు ఉంటుంది. ఇందులో చిన్న యాంటీబాడీ (సింగిల్​ డొమైన్) లను ఇన్​హేలర్​ వంటి సాధనాల ద్వారా తీసుకోవచ్చు.

2016 లోనే..

లామాల రోగనిరోధక వ్యవస్థపై 2016లోనే పరిశోధనలు జరిపారు. 9 నెలల వయసున్న లామా శరీరంలోకి స్పైక్​ ప్రోటీన్లు ఉంటే సార్స్​, మెర్స్ కరోనా వైరస్​లను ప్రవేశపెట్టారు. ఆరు నెలలపాటు ఈ ప్రక్రియను కొనసాగించారు.

అనంతరం దాని రక్తనమూనాలను సేకరించి స్పైక్​ ప్రోటీన్లపై ఉన్న యాంటీబాడీలను వేరు చేశారు. వీటిలో వీహెచ్​హెచ్​- 72 అనే యాంటీబాడీ వైరస్​ను అడ్డుకోవటంలో సమర్థంగా పని చేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇదే విధంగా మానవుల్లోనూ వీహెచ్​హెచ్​- 72 యాంటీబాడీ నమూనాలను నిర్మించగలిగితే కరోనా ప్రోటీన్ నిర్మాణాలను అడ్డుకుని వైరస్​ను తటస్థీకరిస్తుందని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.