ETV Bharat / international

'అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్​కే అధిక ప్రాధాన్యం'

అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే తమ విదేశాంగ విధానంలో భారత్​కు అధిక ప్రాధాన్యమిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఓ ఎన్నికల ఫండ్​ రైజింగ్ కార్యక్రమంలో తెలిపారు.

Joe Biden
జో బిడెన్​
author img

By

Published : Jul 2, 2020, 9:49 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే భారత్​కు అధిక ప్రాధాన్యమిస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ ప్రకటించారు. భారత్​ను సహజ భాగస్వామిగా అభివర్ణించిన ఆయన.. తాను అధ్యక్షుడైతే రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

బీకాన్ సీఈఓ అలాన్ లెవెంథర్​ నిర్వహించిన వర్చువల్​ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు బైడెన్​. ఈ సందర్భంగా అమెరికాకు గతంలో 8 ఏళ్లపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన బైడెన్​ను భారత్​తో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.

"మా భద్రత కోసం భారత్​తో ప్రాంతీయ భాగస్వామ్యం అవసరం. నిజం చెప్పాలంటే వాళ్లకు అంతే ముఖ్యం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన దేశాల భద్రతకు చాలా ముఖ్యం. నేను అధికారంలో ఉన్న సమయంలోనే భారత్​- అమెరికా పౌర అణు ఒప్పందం జరిగింది. ఒబామా-బైడెన్​ నాయకత్వం తరహాలోనే నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్​కు అధిక ప్రాధాన్యం ఉంటుంది."

- జో బైడెన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు

ఇదే వేదికగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై విరుచుకుపడ్డారు బైడెన్​. మొదటి నుంచి కరోనా వైరస్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నా ట్రంప్ ఖాతరు చేయలేదని ఆరోపించారు. ఫలితంగా వైరస్​పై పోరులో ట్రంప్ ప్రభుత్వం తేలిపోయిందని విమర్శించారు. ట్రంప్ పాలనతో అమెరికా రోదిస్తోందన్నారు.

ఇదీ చూడండి: అమెరికాలో ఒక్కరోజే 52 వేల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.