రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం ఉదయం ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో ప్రత్యక్షంగా ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు.. "నేను ఓ వ్యక్తికి ఓటు వేశాను. ఆయన పేరు.. ట్రంప్'' అని పేర్కొన్నారు.
ప్రతి ఏటా న్యూయర్క్‌లో ఓటు హక్కు వినియోగించుకునేవారు ట్రంప్. గతేడాది తన నివాసం ఫ్లోరిడాకు మార్చడం వల్ల ఈ ఏడాది ఈ ప్రాంతంలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. తన ప్రైవేటు క్లబ్ 'మార్-ఏ-లాగో' సమీపంలోనే పశ్చిమ పామ్ బీచ్ ఉంది.
ట్రంప్ పోలింగ్ కేంద్రానికి రాగానే.. వందలాది మంది మద్దతుదారులు జెండాలు పట్టుకొని తరలివచ్చారు. ఓటు వేసే సమయంలో మాస్కు ధరించే వచ్చారు ట్రంప్. బ్యాలెట్ ఓటు కంటే ఇది చాలా సురక్షితమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.
బైడెన్‌కు నో ఛాన్స్..
డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఇంకా ఓటు వేయలేదు. నవంబర్ 3 'ఎలక్షన్ డే' రోజున డెలావేర్ ప్రాంతంలో ఆయన ఓటు వేస్తారని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఫ్లోరిడా తరహాలో డెలావేర్లో ఇన్-పర్సన్(ప్రత్యక్షంగా) ఓటింగ్‌కు ఆస్కారం లేదు. శనివారం కూడా ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నార్త్ కరోలినా, ఒహియో, విస్కాన్సిన్లో ట్రంప్ ర్యాలీలు జరిగాయి.
ఇదీ చూడండి: