ETV Bharat / international

అమెరికాను వెంటాడుతున్న వెంటిలేటర్ల కొరత!

ప్రాణాంతక కరోనా అమెరికాను కుదిపేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్య పరికరాల కొరత అగ్రరాజ్యాన్ని వెంటాడుతోంది. 10 రోజుల్లో తమ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు నిండుకునే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని న్యూయర్క్​ నగర మేయర్​ ఆందోళన వ్యక్తం చేశారు.

Hunt for medical gear to fight virus becomes all-consuming
అమెరికాను వెంటాడుతున్న వెంటిలేటర్ల కొరత!
author img

By

Published : Mar 24, 2020, 7:28 AM IST

Updated : Mar 24, 2020, 10:01 AM IST

అమెరికాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో వైద్య సామగ్రి నిల్వలు గణనీయంగా తరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 10 రోజుల్లో తమ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు నిండుకునే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని న్యూయార్క్‌ నగర మేయర్‌ డి బ్లాసియో ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది వినియోగించే వ్యక్తిగత పరిరక్షణ సామగ్రి కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 5% ఒక్క న్యూయార్క్‌లోనివే కావడం గమనార్హం. మరోవైపు, కరోనాను ఎదుర్కొనేందుకుగాను వేల సంఖ్యలో అదనపు పడకలను సమకూర్చుకోవాలని ఆస్పత్రులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

ప్యాకేజీకి సెనేట్‌ నిరాకరణ

కరోనా దెబ్బకు కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపిరులూదేందుకు దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల భారీ ప్యాకేజీని ప్రతిపాదించిన ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. డెమోక్రాట్ల మద్దతు దక్కకపోవడం వల్ల సెనేట్‌లో ప్యాకేజీకి ఆమోద ముద్ర పడలేదు.

ఇదీ చూడండి: కరోనాకు 15,495మంది బలి- 3లక్షల 60వేల కేసులు

Last Updated : Mar 24, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.