అమెరికాలో సాలీ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. వేగంగా దూసుకొస్తున్న ఈ తుపాను.. ఫ్లోరిడా పాన్హ్యాండిల్, అలబామా తీరంలోని కొన్ని ప్రాంతాలను తాకింది. గతంలో ఎన్నడూలేని విధంగా అక్కడ సుమారు 30 అంగుళాల మేర వర్షపాతం నమోదైంది. అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు.
గంటకు 75మైళ్ల(125 కిలోమీటర్లు) వేగంతో వీస్తోన్న గాలుల ప్రభావంతో సాలీ తుపాను.. అలబామా, దక్షిణ మొబైల్ ప్రాంతాల్లో తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్హెచ్సీ) తెలిపింది. అయితే.. త్వరలోనే ఇది గంటకు 2 మైళ్ల(3 కి.మీ) వేగంతో తీరం దాటుతుందని పేర్కొంది.
సాలీ ప్రభావంతో తీవ్రమైన వరదలు సంభవించే అవకాశముందని భావించిన ఎన్హెచ్సీ.. మిసిసిపీ నది సమీప ప్రాంతాల్లో హెచ్చరికలు జారీచేసింది. తీర ప్రాంతాల్లో సుమారు 20 అంగుళాల(50 సెం.మీ) మేర వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: 'లారా' ధాటికి అమెరికా గజగజ