ETV Bharat / international

'అమెరికా దాడి'పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే..? - అమెరికా ఇరాన్ తాజా వార్తలు

ఇరాన్​ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమానీని హతమార్చటంపై ప్రపంచ దేశాలు మిశ్రమంగా స్పందించాయి. రష్యా, సిరియా ఈ చర్యను ఖండించగా పలు దేశాలు ఇరువైపులా సహనం వహించాలని కోరాయి. అమెరికా దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది సిరియా ప్రభుత్వం.

SOLEIMANI-WORLD REAX
SOLEIMANI-WORLD REAX
author img

By

Published : Jan 3, 2020, 3:52 PM IST

అమెరికా వైమానిక దాడిపై ప్రపంచ దేశాలు మిశ్రమంగా స్పందించాయి. ఇరాన్​ కీలక సైనికాధిపతి ఖాసీం సులేమానీ మరణం నేపథ్యంలో శాంతి, ఓర్పుతో మెలగాలని సూచించాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు హర్షిస్తుండగా.. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

'అమెరికన్లకు చంపినందుకు ప్రతిఫలం'

"అద్భుతం.. అమెరికన్​ పౌరులను చంపినందుకు, గాయపరిచినందుకు ఇదే ప్రతిఫలం."

- లిండ్​సే గ్రహమ్​, సెనేటర్​

దుస్సాహసం: రష్యా

"సోలేమానీ హత్య.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచే దుస్సాహసం. ​జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దేశభక్తితో ఇరాన్​ కోసం సోలేమానీ పాటుపడ్డారు. ఇరాన్ ప్రజలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం."

- రష్యా విదేశాంగ శాఖ

ఉద్రిక్తతలు పెరుగుతాయి: పెలోసీ

సోలేమానీ హత్యతో హింసాత్మక పరిస్థితులు పెరిగే అవకాశం ఉందని అమెరికా ప్రతినిధుల సభాపతి నాన్సీ పెలోసీ అభిప్రాయపడ్డారు.

ఉద్రిక్తతలు పెరిగితే అమెరికాతో సహా ప్రపంచం ఏమీ చేయలేదని ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్​ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరిగేలా ట్రంప్ నిప్పు రాజేశారని విమర్శించారు బిడెన్​.

సహనం పాటించాలి: చైనా

''అంతర్జాతీయ సంబంధాల్లో సైన్యం వినియోగాన్ని మేం ప్రతిసారి వ్యతిరేకించాం. రెండు వైపులా.. ముఖ్యంగా అమెరికా సహనంతో ఉండాలని కోరుతున్నాం. మరిన్ని ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి."

- జెంగ్ షువాంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

'ప్రపంచానికి మరింత ప్రమాదం'

"ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాం. ఈ విషయంలో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్​.. ఇరువర్గాలతో సంప్రదిస్తారు. ఇలాంటి ఘటనల ద్వారా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాలని కోరుతున్నాం. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం పెరగాలని ఫ్రాన్స్​ కృషి చేస్తుంది."

-ఎమెలీ ది మోంట్​చాలిన్​, ఫ్రాన్స్​ తరఫు ఐరోపా మంత్రి

పిరికిపంద చర్య: సిరియా

అమెరికా చర్యపై సిరియా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. పశ్చిమాసియాలో చమురు సంక్షోభాన్ని పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

"అమెరికా చేసిన దాడి పిరికిపంద చర్య. ఇలాంటి చర్యల ద్వారా మరణించిన నేతల అడుగుజాడల్లో నడిచేవారి సంఖ్య పెరుగుతుంది."

-సిరియా విదేశాంగ శాఖ

ఇదీ చూడండి: ఖాసీం మృతితో అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధమేఘాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.