హాంకాంగ్ ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను ఆపకపోయుంటే.. చైనా బలగాల చేతిలో హాంకాంగ్ 14 నిముషాల్లో నాశనమయ్యేదని తెలిపారు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ట్రంప్.
తాను అడగటం వల్లే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. తమ బలగాలను హాంకాంగ్‌కు పంపించలేదని స్పష్టం చేశారు ట్రంప్.
కొన్ని నెలలుగా నిరసనలు...
హాంకాంగ్‌లో కొన్ని నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. బీజింగ్ ప్రమేయం లేకుండా తాము మెచ్చిన నేతను తమ నాయకుడిగా ఎన్నుకునే స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
150ఏళ్లకు పైగా బ్రిటిష్ కాలనీగా ఉన్న హాంకాంగ్ 1997లో చైనా అధీనంలోకి వచ్చింది. చైనా ఇచ్చిన పాక్షిక స్వయం ప్రతిపత్తి కారణంగా పూర్తి స్వేచ్ఛను పొందలేకపోతున్నామని హాంకాంగ్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:వ్యాపం కుంభకోణం: 31 మంది దోషులు-25న తీర్పు