ETV Bharat / international

ఇంట్లో తయారు చేసుకునే మాస్కులతో జాగ్రత్త! - ఇంట్లో తయారు చేసుకునే మాస్కులు

ఇంట్లో తయారు చేసుకునే మాస్కుల్లోని ఫైబర్​ కణాలు గాలిలోకి విడుదల అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి వైరస్​ కణాలను మోసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల మామూలు క్లాత్​తో తయారుచేసే ఈ మాస్కులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

mask
మాస్కు
author img

By

Published : Sep 28, 2020, 11:49 AM IST

కరోనా వైరస్​ను నిలువరించటంలో సర్జికల్​, ఎన్​-95 మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నాయని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, వీటితో పెద్దగా సమస్య లేకపోయినా.. ఇంట్లో తయారు చేసే మాస్కులు అంత ప్రభావవంతం కావని పరిశోధకులు గుర్తించారు.

ఈ మాస్కుల మామూలు క్లాత్​తో తయారు చేయటం వల్ల ఆ దారాల్లోని పైబర్​ పెద్ద మొత్తంలో గాలిలోకి విడుదల అవుతున్నాయని చెబుతున్నారు. ఈ ఫైబర్​ నీటి బిందువులను కూడా మోసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఈ మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం అవసరమని సూచిస్తున్నారు.

కాలిఫోర్నియా డేవిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన ఈ అధ్యయన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్​లో ప్రచురితమయ్యాయి. మాస్కుల నుంచి కణాల ప్రవాహాన్ని కొలిచేందుకు కొంతమంది వలంటీర్లపై ప్రయోగాలు చేశారు. శ్వాసించేటప్పుడు, మాట్లాడటం, దగ్గు, నమలడం ఇలా పలు సమయాల్లో బిందువుల ప్రవాహాన్ని గుర్తించారు.

జాగ్రత్త అవసరం..

సర్జికల్, ఎన్​-95 మాస్కులు బిందువుల ప్రవాహాన్ని నిరోధించినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. సాధారణ మాస్కులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. వీటి నుంచి వచ్చే బిందువులు పరిమాణంలో చిన్నవి కావటం వల్ల గాలిలో తేలియాడుతాయని, అయితే.. వీటికి వైరస్​ను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటం ప్రమాదకరమైన విషయమని హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికీ, గాలిలో తేలియాడే కణాలను అడ్డుకోవటంలో మాస్కులు పని చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయటం అవసరమని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: భారతీయ వ్యాక్సిన్​పై మోదీ భరోసా.. డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.