ETV Bharat / international

రయ్​రయ్​: సూపర్ కార్లన్నీ ఒకేచోటకు వస్తే...

ప్రముఖ హాలీవుడ్​ చిత్రాల్లో రయ్​ రయ్​మంటూ దూసుకుపోయిన కార్లు ఒక గూటికి చేరాయి. వీటి ప్రదర్శనకు అమెరికా లాస్​ ఏంజెలస్​లోని మ్యూజియం వేదికైంది.

రయ్​రయ్​: సూపర్ కార్లన్నీ ఒకేచోటకు వస్తే...
author img

By

Published : May 25, 2019, 8:15 PM IST

రయ్​రయ్​: సూపర్ కార్లన్నీ ఒకేచోట

అద్భుత గ్రాఫిక్స్​, కళ్లు చెదిరే విజువల్స్​తో పాటు అదిరిపోయే కార్ల ప్రదర్శనకు అడ్డా హాలీవుడ్​. ఎంతో మందికి హాలీవుడ్​ చిత్రాలు చూడటం వల్లే కార్లపై మోజు పెరిగిందనడంలో సందేహం లేదు. తమ అభిమాన హీరో అత్యాధునిక వాహనాలపై దూసుకుపోయే సన్నివేశాలకు థియేటర్లలో ఈలలు పడటం ఖాయం. అలాంటి హాలీవుడ్​ ప్రముఖ చిత్రాల్లోని కార్లన్నీ ఒక్క చోట చేరితే?

అమెరికా లాస్​ ఏంజెలస్​లో 'హాలీవుడ్​ డ్రీమ్​ మెషీన్స్​' పేరుతో పీటర్సన్​ ఆటోమొబైల్​ మ్యూజియంలో కార్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. బ్లేడ్​ రన్నర్​, డెత్​ రేస్​, టెర్మినేటర్, మ్యాడ్​ మ్యాక్స్​ ఫ్యూరీ రోడ్, బ్లాక్​ పాంతర్​​ సహా 40 హాలీవుడ్​ సినిమాల్లో ఉపయోగించిన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

ట్రాన్స్​ఫార్మర్స్​ సిరీస్​లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన 'బంబల్​ బీ'తో పాటు స్టార్​ వార్స్​లోని స్పేస్​ షిప్​ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.​ హాలీవుడ్​ డ్రీమ్​ మెషీన్స్ ప్రదర్శన​ ఎంతో అద్భుతంగా ఉందని వాహన రంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

"రవాణా, రూపకల్పన, వినోదాల కలయికే ఈ కార్ల ప్రదర్శన. ఇందులోని కార్లు, ట్రక్కులు, స్పేష్​షిప్స్​ 20-30 ఏళ్లవి. ఇవి ఓ పెద్ద సంచలనం. చాలా అద్భుతంగా ఉంటాయి."
-- గ్లెన్​ ఓయంగ్​, ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​- ఎల్​ఏకార్​.కామ్​

వాహనాలే కాదు... ఎన్నో చిత్రాల్లో ఆకట్టుకున్న కళఖండాలనూ సందర్శనకు ఉంచారు.

మార్చి 2020 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.

ఇదీ చూడండి: డ్రోన్ల డ్యాన్స్​తో ఆకాశంలో జిల్​జిల్ జిగాజిగా

New Delhi, May 25 (ANI): While talking on Congress president Rahul Gandhi's defeat in Uttar Pradesh's Amethi Lok Sabha constituency, Nationalist Congress Party (NCP) leader Majeed Memon called Smriti Irani a 'Grade B leader'.He said, "Congress president lost to an unimportant leader, what is Smriti Irani's stature. She is just a Grade B leader according to me and in my eyes".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.