అమెరికా టెక్సాస్ గల్ఫ్ తీరంలోని పలు నగరాలను హిమపాతం బెంబేలెత్తిస్తోంది. హౌస్టన్‌లో 30 సెంటీమీటర్లు, వర్జీనియాలో 20 సెంటీమీటర్లు, డల్లాస్‌లో 15 సెంటీమీటర్ల మంచు కురిసినట్లు యూఎస్ వాతావరణ విభాగం తెలిపింది. భారీ హిమపాతం కారణంగా టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబ్బాట్ అత్యవసర పరిస్థితి విధించారు.
డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 760 విమాన సేవలను అధికారులు రద్దు చేశారు. ఓక్లహామాలో రహదార్లపై పెద్దఎత్తున మంచు పేరుకుపోయింది. చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలేవ్వరు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో ఉన్న ప్రజలు అవసరానికి మించి విద్యుత్ వాడొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ అధికంగా ఉండటంతో గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండి : 'భయంతోనే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు'