బ్రెజిల్‌లోని ఎంతో సుందరమైన సావో పాలో నగరం.. సోమవారం కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరుచుకుపడ్డాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
వరదల కారణంగా టైట్, పిన్హీరోస్ నదులు ఉప్పొంగిపోతున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరుకుంది. ఫలితంగా జనజీవనం స్తంభించి.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
స్కూళ్లు, రైళ్లు బంద్...
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు గంటల్లోనే 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. వరద ముప్పు కారణంగా 43 పాఠశాలలను మూసివేశారు. కొన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.