ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్ల నుంచి గుండె జబ్బుల మరణాలే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగినట్లు పేర్కొంది. డయాబెటిస్, మానసిక వ్యాధుల కారణంగా అధిక శాతం మంది మృతిచెందుతున్నారని తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ చెప్పిన కీలక విషయాలు:
- 2000 నుంచి 2019 మధ్య కాలంలో అంటువ్యాధులు కాని రోగాల వల్లే ఎక్కువ శాతం మంది మృతి చెందారు. ప్రస్తుతం ఎక్కువ మందిని బలిగొన్న టాప్ 10 రోగాల్లో 7 ఇవే ఉండడం గమనార్హం.
- మొత్తం మరణాల్లో 16 శాతం గుండె జబ్బుల వల్లే సంభవిస్తున్నాయి. 2000లో 20 లక్షల మంది గుండె జబ్బులతో మృతిచెందగా 2019 వచ్చే సరికి ఈ సంఖ్య 90 లక్షలకు చేరింది.
- అమెరికా, ఐరోపా దేశాల్లో అధిక శాతం మంది అల్జీమర్స్ వ్యాధికి బలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 65 శాతం మంది మహిళలు ఈ వ్యాధి వల్లే మరణిస్తున్నారు.
- 2000-2019 మధ్య డయాబెటిస్ మృతుల సంఖ్య 70 శాతం పెరిగింది. ఈ మొత్తంలో 80 శాతం మంది పురుషులే ఉన్నారు.
- 2019లో నిమోనియా, శ్వాసకోశ సమస్యలు... ఎక్కువ మరణాలకు కారణమైన జబ్బుల్లో నాలుగో స్థానంలో నిలిచాయి.
- గతంలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ కారణంగా అనేకులు మరణించేవారు. ప్రస్తుతం 2019 నాటికి ఈ సంఖ్య బాగా తగ్గిపోయింది. మృతుల సంఖ్య పరంగా హెచ్ఐవీ ప్రస్తుతం 19 స్థానానికి చేరింది.
- టీబీ(ట్యూబర్ క్యూలాసిస్) మృతుల సంఖ్య 2019 నాటికి 30% శాతం తగ్గింది. ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియాల్లో మాత్రం టీబీ మృతుల సంఖ్య భారీగానే ఉంది.
- తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో అంటువ్యాధులే ఎక్కువ మందిని బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి దేశాల్లో మలేరియా(6), టీబీ(8), హెచ్ఐవీ/ఎయిడ్స్ (9) స్థానాల్లో ఉన్నాయి.
- సగటు ఆయువు ఆరేళ్లు పెరిగింది.
ఇదీ చదవండి:ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు ట్రంప్