ETV Bharat / international

వ్యాక్సిన్‌ తీసుకున్న అధినేతలు ఎవరంటే..!

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన క్రమంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు పలువురు దేశాధినేతలు, ప్రముఖులు తొలుత టీకా తీసుకునేందుకు ముందుకువస్తున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​తో పాటు పలు దేశాల అధినేతలు ఉన్నారు. వారు ఎవరెవరో ఓ లుక్కేద్దాం.

Vaccinated leaders
వ్యాక్సిన్‌ తీసుకున్న అధినేతలు
author img

By

Published : Jan 9, 2021, 5:21 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద ఇప్పటికే 35 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీకి ఆయా దేశాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు దేశాధినేతలు, ప్రముఖులు తొలుత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఇలా తీసుకున్న వారిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని‌ నెతన్యాహు వంటి నేతలు వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

జో బైడెన్‌, కమలా హారిస్‌..

ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ తొలిసారిగా బ్రిటన్‌లో అనుమతి పొందిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా ఈ వ్యాక్సిన్‌ ఉపయోగానికి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, కమలా హారిస్‌ బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మహమ్మారిపై పోరులో శాస్త్రవేత్తలు ఎంతో కృషి ఫలితంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయమని, ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. వీరితో పాటు అమెరికా అంటువ్యాధులు నిపుణులు ఆంటోనీ ఫౌచీ కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా ముందున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ కూడా తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికే కొవిడ్‌ నుంచి కోలుకున్న కారణంగా వైద్యుల సూచనల మేరకు తీసుకుంటానని ట్రంప్‌ ప్రకటించారు. వీరితోపాటు వైట్‌హౌస్‌ సిబ్బంది, రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకుంటున్నారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి వంటి ప్రముఖులు కూడా వ్యాక్సిన్‌ను అందరిముందే తీసుకున్నారు.

Vaccinated leaders
టీకా తీసుకుంటున్న జో బైడెన్​, కమలా హారిస్​

అదేబాటలో ఇజ్రాయెల్‌ ప్రధాని..

కరోనా వ్యాక్సిన్‌పై ముమ్మర ప్రచారం కల్పించడంలో భాగంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా వ్యాక్సిన్‌ను బహింరంగంగానే తీసుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడి జనాభాలో 12శాతం మందికి వ్యాక్సిన్‌ అందించారు.

Vaccinated leaders
టీకా తీసుకుంటున్న ఇజ్రాయెల్‌ ప్రధాని

సింగపూర్‌ ప్రధాని..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సింగపూర్ ప్రధాని లీ హైసెన్‌ లూంగ్‌ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మధ్యే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకున్న లీ.. వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక సింగపూర్‌లో దాదాపు 60శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఈ మధ్యే సింగపూర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Vaccinated leaders
టీకా తీసుకుంటున్న సింగపూర్​ ప్రధాని

గ్రీక్‌ ప్రధాని..

కరోనా ధాటికి వణికిపోతున్న యూరప్‌లోనూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియల్‌లో 27 దేశాల్లో టీకా పంపిణీ ప్రక్రియ మొదలైంది. ఇక్కడ ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గ్రీస్‌ ప్రధానమంత్రి కైరియాకోస్‌ మిట్సోటకిస్‌ కూడా వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధమే అని ఇప్పటికే ప్రకటించారు. మొట్టమొదటి టీకాను తన కూతురికి ఇచ్చినట్లు ప్రకటించిన ఆయన.. సరైన సమయంలో తాను కూడా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటానని వెల్లడించారు. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటామని వెల్లడించారు. ఇక మీడియా మొఘల్‌గా పేరుగాంచిన ఫాక్స్‌ న్యూస్‌ ఛైర్మన్‌ రూపెర్ట్‌ ముర్డోక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ముందున్నారు.

ఇదీ చూడండి: 'డోసుల మధ్య వ్యవధి 6 వారాలు ఉండొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.