ETV Bharat / international

శానిటైజర్​ వల్ల బ్యాలెట్​ స్కానర్​ జామ్​

author img

By

Published : Nov 4, 2020, 7:15 PM IST

అమెరికా అయోవాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో.. ఓటర్లు శానిటైజ్​ చేసుకున్న చేతులతో ఓటు వేయడం వల్ల ఓ బ్యాలెట్​ స్కానర్​ మొరాయించింది. తడి ఎక్కువగా ఉండటం వల్లే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు.

Hand sanitiser jams ballot scanner in US
శానిటైజర్​ వల్ల బ్యాలెట్​ స్కానర్​ జామ్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ వింత ఘటన జరిగింది. అయోవాలోని ఓ పోలింగ్​ బూత్​లో ఓ బ్యాలెట్​ స్కానర్​ మోరాయించింది. దీనికి శానిటైజర్లు కారణం కావడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.

తడి పెరిగిపోయి..

కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించేందుకు అయోవా డెస్​ మోయినెస్​లో శానిటైజర్లను ఏర్పాటు చేశారు ఎన్నికల సిబ్బంది. ఓటర్లు చేతులను శానిటైజ్​ చేసుకున్న తర్వాత.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే శానిటైజర్​తో తడి ఎక్కువ అవ్వడం వల్ల బాల్యెట్​ స్కానర్ జామ్​ అయిపోయింది. ఒక గంట పాటు​ పని చేయలేదు.

ఇతర స్కానర్లకు ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. శానిటైజర్లను మునుపటికన్నా కొంత దూరంలో పెట్టారు.

అయోవాలో ఇటీవలే కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,35,000కుపైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి- అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కు బౌల్డ్​ అయ్యేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.