ETV Bharat / international

భూత, పిశాచాల వేషధారణల పండుగ 'హాలోవీన్'​!

author img

By

Published : Nov 1, 2019, 6:34 AM IST

Updated : Nov 1, 2019, 10:34 AM IST

వినోదం కోసం ఎంత దూరమైనా వెళ్లే, ఏదైనా చేస్తుంటారు సిటీ ప్రజలు. వినూత్న సరదాలను జరుపుకోవటానికి వెనుకాడరు. పాశ్చాత్య దేశాల్లో సంప్రదాయ పండుగగా మారిన వేడుక 'హాలోవీన్‌'. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న దీనిని జరుపుకుంటారు. నగరవాసులంతా కలిసి భూత ప్రేత పిశాచాల వేషధారణతో దర్శనమిస్తారు.

భూత పిశాచాల వేషధారణలో ప్రపంచదేశాలు
భూత, పిశాచాల వేషధారణల పండుగ 'హాలోవీన్'​!

హాలోవీన్​

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అక్టోబర్‌ 31న ‘హాలోవీన్‌ డే’ను ఘనంగా చేసుకుంటారు. ముఖం గుర్తు పట్టకుండా ఉండేలా మేకప్‌ వేసుకుంటారు. విచిత్ర వేషధారణతో భయపెడుతుంటారు.

ఎందుకు..?

హాలోవీన్‌ ఇప్పటి వేడుక కాదు. ప్రాచీనకాలం నుంచి వస్తున్న పండుగ. శతాబ్దాలుగా ఆయా దేశాల్లో ఉన్న మూఢనమ్మకాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. దయ్యాలను పారదోలటానికి ప్రజలు మంటలను వెలిగించి వైవిధ్యమైన వేషాలు ధరిస్తుండేవారు. అలా వేషధారణ చేసుకుంటే భూతాలు వారి దరి చేరవని నమ్మకం. అలా వీరంతా కలిసి, ముఖ్యంగా క్యాథోలిక్స్ నవంబర్‌ 1న సెయింట్స్‌కి ​ ప్రార్థనలు చేసేవారు. ఆ రోజు 'అల్​ సెయింట్స్​ డే' అని అంటారు. అల్‌ సెయింట్స్‌డే ముందు రోజు రాత్రిని 'అల్‌ హాలోస్‌' పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. ఆ రోజున అందరూ తాము అమితంగా ప్రేమించి.. చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తుంటారు.

ఆ తర్వాత కాలంలో ఇదే 'హాలోవిన్‌' డే గా మారింది. ఈ సంప్రదాయాలు, నమ్మకాల సంగతి ఎలావున్నా నగరవాసులు మాత్రం దీన్నో ఆనందకర పండుగగా మార్చేశారు. వినూత్న దుస్తులు, ముఖానికి రంగులు, భయపెట్టే అలంకరణతో ఈ పండుగను చేసుకుంటారు. అత్యంత భయంకరంగా వేషధారణ వేసుకుంటూ క్లబ్స్​లో, రెస్టారెంట్లో డీజే మ్యూజిక్‌తో సేద తీరుతూ సందడి చేస్తుంటారు.

లండన్

లండన్​ వీధుల్లో వికృతమైన అలంకరణతో గుర్రపు బండ్లపై సవారీ చేస్తూ కనువిందు చేశారు సిటీవాసులు.

అమెరికా

అమెరికా 'శ్వేత సౌధం​'ను దీపకాంతులతో అలంకరించారు. చిన్న పిల్లలంతా కలిసి వివిధ రకాల వేషాలు వేసుకొని పోటీలో పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అతని సతీమణి కలిసి ఈ పండుగలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులకు బహుమతులు అందించారు.

ఐర్లాండ్​

ఇక్కడ ప్రజలందరూ పుర్రెలు, అస్థిపంజరాల వేషాలతో సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ వీధుల్లో, పబ్స్​లో రోజును గడిపారు.

ఇదీ చూడండి : బాగ్దాదీ పోయాడు.. ఇప్పుడు మా నాయకుడు​ ఖురేషీ: ఐసిస్​

Patna (Bihar), Oct 31 (ANI): Bihar Chief Minister Nitish Kumar on October 31 inspected the different ghats in the wake of upcoming Chhath 'Mahaparv.' He said that the preparations are almost done but he also added that people shouldn't expect the ghats like previous year. However, the Bihar Chief Minister asserted that state government is taking every measure to ensure the security arrangements during the Mahaparv.
Last Updated : Nov 1, 2019, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.