హెచ్-1బీ వీసాల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించినట్లు వివరించింది.
2021 సీజన్‌కు సంబంధించి ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపింది. వీటికి దరఖాస్తులను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్వీకరించనున్నట్లు పేర్కొంది. 2021 సీజన్‌లో హెచ్-1బీ వీసాల కింద విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలనుకునే కంపెనీలు 2020 మార్చి 1 నుంచి 20 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:పాక్ అమ్మాయిలను వధువు ముసుగులో చైనాకు విక్రయం..!