ETV Bharat / international

హెచ్​-1బీ వీసా ఇంటర్వ్యూపై అమెరికా కీలక ప్రకటన! - హెచ్​1బీ వీసా ఇంటర్వ్యూ

H1B visa interview: కొవిడ్​ భయాలు వెంటాడుతున్న తరుణంలో హెచ్​-1బీతో పాటు ఇతర వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్​పర్సన్​ ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

H1B visa interview:
హెచ్​-1బీ వీసా ఇంటర్వ్యూపై అమెరికా కీలక ప్రకటన!
author img

By

Published : Dec 24, 2021, 10:40 AM IST

Updated : Dec 24, 2021, 11:59 AM IST

H1B visa news today: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హెచ్​-1బీ, ఎల్​-1, ఓ-1 వీసాల 'ఇన్​పర్సన్​' ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

కొన్ని వర్కింగ్​ వీసాల జారీలో.. చివరి రౌండ్​గా ఇన్​పర్సన్​ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో.. దరఖాస్తు చేసుకున్న వారు కాన్సులేట్​కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్​-1బీ వీసా, ట్రైనీ/ ప్రత్యేక విద్య కోసం అమెరికాను సందర్శించే వారు(హెచ్​-3), కంపెనీ ట్రాన్స్​ఫర్లు(ఎల్​ వీసా), ఓ వీసా, అథ్లెట్లు- కళాకారులు(పీ వీసా), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి(క్యూ వీసా) ఇన్​పర్సన్​ ఇంటర్వ్యూలను.. 2022 డిసెంబర్​ 31 వరకు నిలిపివేస్తున్నట్టు అగ్రరాజ్యం విదేశాంగశాఖ వెల్లడించింది.

హెచ్​-2 వీసా, ఎఫ్​-ఎమ్​ వీసా, ఎకాడమిక్​ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. వచ్చే ఏడాది డిసెంబర్​ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్​ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్​.

అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్​ అధికారులు ఇన్​పర్సన్​ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్​సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది.

ఇదీ చూడండి:- H1B visa news: 'బైడెన్'​ కీలక నిర్ణయం​- భారతీయ అమెరికన్లకు ప్రయోజనం

Last Updated : Dec 24, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.