సెంట్రల్ మెక్సికోలో దారుణం జరిగింది. మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన కొందరు 13 మందిని కాల్చి చంపారు. ఇందులో 8 మంది పోలీసులు ఉండగా.. మరో 5 మంది ప్రాసిక్యూషన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
2019లో జరిగిన ఘటనలో మొత్తం 14 మంది అధికారులు ఒకేసారి హత్యకు గురయ్యారు. తరువాతి కాలంలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు.
హంతకుల కోసం సైనికులు, మెరైన్ పోలీసులు, జాతీయ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతా విభాగం అధిపతి రోడ్రిగో మార్టినెజ్ సెలిస్ తెలిపారు.
"దాడి జరిగిన ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఈ దాడి ఏ ముఠా సభ్యులు చేశారు అనే దానిపై స్పష్టత లేదు. ఇది కేవలం అధికారులను చంపడంగా మేము భావించడం లేదు. మెక్సికన్ ప్రభుత్వంపై దాడిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికే అన్ని దళాలను అప్రమత్తం చేశాం."
- రోడ్రిగో మార్టినెజ్ సెలిస్, భద్రతా విభాగం అధిపతి
ఇదీ చూడండి: 'హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయండి'