ETV Bharat / international

శ్వేతసౌధాన్ని వీడిన వేళ ట్రంప్​కు 'గ్రేటా' కౌంటర్​

ట్రంప్‌ వీడ్కోలుపై తనదైన రీతిలో స్పందించారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్త, టీనేజర్​ గ్రేటా థన్​బర్గ్​. అమెరికా అధ్యక్ష భవనాన్నిట్రంప్​ వీడుతున్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేసి, దానికి ఓ వ్యంగ్య వ్యాఖ్యను జోడించారు. గతంలో ఆమెను ఉద్దేశిస్తూ ట్రంప్​ వాడిన పదాలతోనే ఈ కౌంటర్​ ఇచ్చారు గ్రేటా. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

greta thunberg about trump
శ్వేతసౌధాన్ని వీడిన వేళ ట్రంప్​కు 'గ్రేటా' కౌంటర్​!
author img

By

Published : Jan 22, 2021, 9:01 AM IST

మొదటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని విమర్శిస్తుంటారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్. కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ రాకతో.. ట్రంప్ అధ్యక్ష భవనాన్ని వీడుతున్నప్పటి ఫొటోను ఆమె షేర్ చేశారు. 'ఆ దృశ్యం చూడటానికి బాగుంది' అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

శ్వేతసౌధాన్ని వీడుతూ, చివరిసారిగా కమాండర్ ఇన్‌ చీఫ్ హోదాలో తన అనుచరులు, అభిమానులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేతితో సంజ్ఞ చేశారు. ఆ దృశ్యం థన్‌బర్గ్ కంట పడింది. వెంటనే దాన్ని ట్విటర్‌లో షేర్ చేసి.. తనదైన శైలిలో స్పందించారు. 'ఈ దృశ్యం చూడటానికి చాలా బాగుంది. సంతోషంగా ఉన్న ఓ వృద్ధుడు అందమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నట్లుంది' అని వ్యంగ్యంగా ఓ వ్యాఖ్యను జోడించారు.

థన్‌బర్గ్‌కు కొత్తేమీ కాదు..

పర్యావరణ మార్పులపై గత కొన్నేళ్లుగా గ్రేటా థన్‌బర్గ్ పోరాటం చేస్తున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను ఆమె ప్రశ్నించారు. ఓసారి ఐరాసలో ప్రసంగిస్తూ.. పర్యావరణానికి ముప్పు కలిగించే నిర్ణయాలతో పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి ఎంత ధైర్యం అంటూ ప్రపంచ నాయకులను ప్రశ్నించారు. ఆమె తీరును విమర్శిస్తూ.. కోపాన్ని నియంత్రించుకోవాలంటూ ఆమెకు ట్రంప్ సూచించారు కూడా. అలాగే ఐరాసలో ఆమె చేసిన ప్రసంగంపై స్పందిస్తూ.. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న, సంతోషంగా ఉన్న బాలికలా ఆమె కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే మాటలతో థన్‌బర్గ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ మాజీ అధ్యక్షుడిని ఆయన వాడిన పదాలతోనే తిప్పికొట్టడం థన్‌బర్గ్‌కు కొత్తేమీ కాదు. కాగా, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికలల్లో ఆమె మొదటి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే మద్దతు ఇచ్చారు.

ఇదీ చూడండి:ట్రంప్‌కు 'యాపిల్'​ సీఈఓ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.