ETV Bharat / international

'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీ! - ట్రైబళ్లకు బైడెన్​ ఆర్థిక ప్యాకేజీ

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక, ట్రైబల్ ప్రభుత్వాలకు భారీ మొత్తం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లలో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు.

Governors and mayors need USD 350 billion
'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ'
author img

By

Published : Feb 13, 2021, 4:59 AM IST

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లతో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. 1.9 ట్రిలియన్​ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 350 బిలియన్​ డాలర్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఇంత మొత్తం ఆర్థిక సాయం అందించడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్​లోని రిపబ్లికన్లు నిరాకరించినా.. కొంత మంది గవర్నర్లు, మేయర్లు ఇందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన నిధులే ఇప్పటివరకు ఖర్చు కాలేదని కొందరు రిపబ్లికన్ నేతలు ఆరోపించారు.

కానీ, గతేడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రాలు 3,32,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించాయని, స్థానిక ప్రభుత్వాలు దాదాపు 1 మిలియన్​ ఉద్యోగాలకు ఉద్వాసన పలికినట్లు బ్యూరో ఆఫ్​ లేబర్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బైడెన్​ నిర్ణయం కీలకంగా మారింది. కొత్తగా స్థానిక ప్రభుత్వాలకు 130.2 బిలియన్​ డాలర్లు, ట్రైబల్ ప్రభుత్వానికి 20 బిలియన్​ డాలర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:స్పుత్నిక్‌ టీకాకు 26 దేశాల ఆమోదం‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.