గూగుల్ సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 1న ఫూల్స్ ప్రాంక్ చేసేది. ఈ ఏడాది ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారినపడడం వల్ల తన సంప్రదాయాన్ని పక్కన పెట్టినట్లు ప్రకటించింది.
"ఇప్పటికే ఏప్రిల్ ఫూల్ ప్రయత్నాలను నిలిపేశాం. కొవిడ్-19పై పోరాడటమే ప్రస్తుతం గూగుల్ లక్ష్యం. చిన్న సంస్థలు సైతం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ ప్రయత్నాలు చేయొద్దు. ఈ సమయంలో ఎటువంటి ప్రాంక్ జోకులు చేయకుండా కొవిడ్-19పై పోరుకు అందరూ మద్దతివ్వాలి."
--- లోరైన్ ట్వోహిల్, గూగుల్ మార్కెటింగ్ హెడ్
కరోనాపై పోరు కోసం గూగుల్ అనేక చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ఇటీవలే ఓ ప్రత్యేక హబ్‌ను ప్రారంభించింది. అధిక మొత్తంలో విరాళం ఇచ్చింది.
ఇదీ చదవండి: ఈఎంఐ కట్టాలా లేదా?... క్లారిటీ ఇచ్చిన బ్యాంకులు