కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 60,26,400 దాటింది. 3,66,400 మందికి పైగా కొవిడ్-19కు బలయ్యారు. వ్యాధి నుంచి 26,56,000పైగా కోలుకున్నారు.
అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 17,93,500 దాటింది. 24 గంటల్లో 25,000పైగా బాధితులుగా మారారు. మరో 1,225 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,04,500 మందికి పైగా ఉంది.
బ్రెజిల్లో 29,000 పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 4,68,000 దాటింది. 27,944 మంది కన్నుమూశారు.
రష్యాలో కొత్తగా 8572 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 3,87,600 దాటింది. 4,374 మంది అసువులు బాశారు.
స్పెయిన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
పాకిస్థాన్‌లో బాధితుల సంఖ్య 64,028కి చేరింది. ఇప్పటివరకు 1,317 మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌లో కొవిడ్-19 బాధితుల సంఖ్య 42,844కు చేరింది. ఇప్పటివరకు 582మంది చనిపోయారు.
ఇదీ చూడండి: 'ట్రంప్ బెదిరింపులు.. రాజకీయ హింసకు ప్రతీక'