ETV Bharat / international

కరోనా మరణాల్లో అమెరికా కొత్త రికార్డ్ - covid virus news

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1.34 లక్షలకు చేరింది. ఈ వైరస్​ ధాటికి అమెరికాలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,569 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. చైనాలో కొవిడ్​-19 మళ్లీ పుంజుకుంటోంది. కొత్తగా 46 కేసులు నమోదయ్యాయి.

Global COVID-19 tracker
అమెరికాలో 24 గంటల్లో 2569 మంది మృతి
author img

By

Published : Apr 16, 2020, 10:53 AM IST

Updated : Apr 16, 2020, 12:31 PM IST

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే 200లకుపైగా దేశాలకు విస్తరించింది ఈ వైరస్​. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటి వరకు సుమారు 1.34లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 20.83లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. ఐరోపా దేశాల్లో దీని​ ప్రభావం ఎక్కువగా ఉంది. మూడోవంతు మరణాలు ఇక్కడే సంభవించాయి.

అగ్రరాజ్యంలో ఆగని ఉద్ధృతి..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 2,569 మంది మృతిచెందారు. ఇంత మంది ఒకేరోజు మరణించటం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 28,529కి చేరింది. కేసుల సంఖ్య 6,44,089కు చేరింది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ ప్రభావం ఎంత మేర ఉందో ఆధారాలు క్రమంగా బయటపడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత నష్టపోయే ప్రమాదం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 1992 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో గత మార్చిలో దుకాణాలు, రెస్టారెంట్లల్లో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోతోంది. గత మూడు వారాల్లో 17 మిలియన్ల మంది నిరుద్యోగ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. ఉద్దీపన చర్యలు చేపట్టింది ట్రంప్​ ప్రభుత్వం. ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.

కరోనా కేసుల సంఖ్యలో అమెరికా గరిష్ఠస్థాయిని దాటిందని పేర్కొన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ఈ నెలలోనే కొన్ని రాష్ట్రాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం కొనసాగుతుందన్న ట్రంప్​.. రాష్ట్రాల గవర్నర్లతో భేటీ తర్వాత దేశంలో అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

చైనాలో 46 కొత్త కేసులు

చైనాలో కరోనా2.0 క్రమంగా విస్తరిస్తోంది. బుధవారం మరో 46 కేసులు నమోదయ్యాయి. అందులో 34 మంది విదేశీయులని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యా సరిహద్దులో వైద్య సదుపాయాలను పెంచింది ప్రభుత్వం. రష్యా నుంచి వస్తున్న వారికి చికిత్స అందించాలని ఆదేశించింది. గురువారం 12 కేసులు నమోదు కాగా అందులో గ్వాంగ్​డాంగ్ రాష్ట్రంలో 5, హీలాంగ్​జియాంగ్​లో 4, బీజింగ్​లో 3 కేసులు ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. అయితే.. వైరస్​ కేంద్ర బిందువు వుహాన్​లో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది.

COVID
ప్రపంచవ్యాప్తంగా కేసులు వివరాలు

Last Updated : Apr 16, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.