ETV Bharat / international

అమెరికా సెనేట్​ ఎన్నికలపై ట్రంప్​ ప్రభావం!

author img

By

Published : Jan 6, 2021, 10:25 AM IST

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. రిపబ్లికన్​ ఓటర్లపై అధ్యక్షుడు ట్రంప్​ ప్రభావం తగ్గినట్టు కనిపించడం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ట్రంప్​ ఆరోపణలను మూడొంతుల మంది రిపబ్లికన్​ ఓటర్లు విశ్వసిస్తున్నట్టు.. జార్జీయా సెనేట్​ ఎన్నికల వేళ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది.

GEORGIA TAKEAWAYS: Trump's long shadow not fading yet
అమెరికా సెనేట్​ ఎన్నికలపై ట్రంప్​ ప్రభావం!

అమెరికా అధ్యక్ష పోరు విజేత జో బైడెన్​కు జార్జీయా సెనేట్​ ఎన్నికలు ఎంతో కీలకం. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సునామీ అనంతరం అగ్రరాజ్య రాజకీయాలు ఎలా ఉండనున్నాయనేదీ ఈ ఎన్నికలతో తేలిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

అధ్యక్ష పోరు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలపై ట్రంప్​ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. బైడెన్​ గెలుపుపై విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్​. ఇది జార్జియాలోని రిపబ్లికన్​ మద్దతుదారులపైనా ప్రభావం చూపించింది. అయితే మూడొంతుల రిపబ్లికన్​ పార్టీ ఓటర్లు.. అధ్యక్ష ఎన్నికల్లో నిజంగానే అవకతవకలు జరిగాయని విశ్వసిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.

ఇదీ చూడండి:- ట్రంప్​ ఫ్యాన్స్​ దెబ్బకు మోత మోగిపోయింది!

అగ్రరాజ్యంలోని వివిధ అంశాలపై ఏపీఓట్​కాస్ట్​ ఈ సర్వే చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగలేదని 10లో 9మంది రిపబ్లికన్​ ఓటర్లు భావిస్తున్నట్టు సర్వే పేర్కొంది. ఫలితంగా.. ట్రంప్​ వాదనను ఏకీభవించే వారి సంఖ్య.. నవంబర్​ తర్వాత నుంచి ఐదు రేట్లు పెరిగడం గమనార్హం.

మరోవైపు రిపబ్లికన్​ పార్టీలో ట్రంప్​ ఆధిపత్యం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. వేలాది మంది ఆయన ర్యాలీలకు తరలివెళుతున్నారు. జార్జీయాలోని రిపబ్లికన్​ సెనేటర్​ కన్నా ట్రంప్​కే ఆదరణ ఎక్కువ ఉంది.

ఇదీ చూడండి- పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.