ETV Bharat / international

శాంతియుతంగా ఫ్లాయిడ్ నిరసనలు- వెనక్కి మళ్లిన సైన్యం!

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంపై వెల్లువెత్తిన నిరసనలు క్రమంగా శాంతియుతంగా మారాయి. హింసాత్మక మార్గాల జోలికి వెళ్లకుండా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. గత రెండు రోజులుగా శాంతియుత నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నట్లు వాషింగ్​టన్ సైనిక అధికారులు తెలిపారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల ప్రజలూ జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.

floyd protests
అమెరికాలో ఫ్లాయిడ్ నిరసనలు
author img

By

Published : Jun 4, 2020, 5:35 AM IST

జాతి వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్​ కుటుంబసభ్యులకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించారు ప్రజలు. హింసాత్మక నిరసనల జోలికి వెళ్లకుండా శాంతియుత ఆందోళనలు చేశారు.

న్యూయార్క్​లో ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు.

నిరసనల్లో భాగంగా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 127 మందిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు డెట్రాయిట్ పోలీసులు వెల్లడించారు.

సైన్యం వెనక్కి

గత రెండు రోజుల నుంచి శాంతియుత నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ డ్యూటీ సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నట్లు వాషింగ్​టన్ సైనిక అధికారులు వెల్లడించారు. 200 మందిని వెనక్కి పంపించగా.. పరిస్థితి అదుపులో ఉంటే మిగిలిన వారిని సైతం తిరిగి పంపించనున్నట్లు తెలిపారు.

'హెలికాఫ్టర్' దర్యాప్తు

వాషింగ్​టన్​లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో నిరసనకారుల పైనుంచి ఆర్మీ హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వైట్​హౌజ్ సమీపంలో జరిగిన ఈ 'బల ప్రదర్శన'పై నేషనల్ గార్డ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా దర్యాప్తు ప్రారంభించింది. సాధారణంగా వైద్య సేవల కోసం వినియోగించే ఈ ఆర్మీ హెలికాఫ్టర్​ను సోమవారం నిరసనకారులు ఉన్న ప్రదేశంలో ఉపయోగించారు. పెద్ద శబ్దాలతో నిరసనకారులను భయపెట్టి చెదరగొట్టేందుకు హెలికాఫ్టర్​ను వినియోగించారు.

ముగ్గురిపై అభియోగాలు

మరోవైపు ఫ్లాయిడ్ ఉదంతం జరిగిన సమయంలో ఘటన స్థలిలో ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులపై హత్యకు సహకరించినట్లు అభియోగాలు మోపారు. ఫ్లాయిడ్ మృతికి కారణమైన ప్రధాన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్​పై నమోదు చేసిన హత్య కేసు తీవ్రతను రెండో డిగ్రీకి పెంచినట్లు స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది. డెరిక్ మరింత తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొనున్నట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా...

జాతి విద్వేశానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఫ్రాన్స్​లోని లియోన్ నగరంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోలీసుల దుశ్చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 2016లో పోలీస్ కస్టడీలో మరణించిన నల్లజాతీయుడు ఆడామా ట్రావొరేకు నివాళులర్పించారు.

floyd protests photos
ఫ్రాన్స్​లో నిరసన ప్రదర్శన

లండన్​లో

ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా సెంట్రల్ లండన్​లో వందలాది మంది నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఆందోళన శ్రుతి మించడం వల్ల పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం ఉన్న 10 డౌనింగ్ స్ట్రీట్​లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. 'బోరిస్ జాన్సన్​ జాత్యహంకారి' అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమెరికా దౌత్య కార్యాలయం వైపు నిరసనకారులు ర్యాలీగా వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

floyd protests photos
బ్రిటన్​లో భారీగా తరలివచ్చిన నిరసనకారులు

జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్ నగర ప్రజలు పాల్గొన్నారు. అమెరికాలోని నిరసనకారులకు మద్దతు తెలిపారు. జాతి విద్వేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

floyd protests photos
జర్మనీలో చంటిబిడ్డలతో నిరసన

స్వీడన్​ రాజధాని స్టాక్​హోంలో వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ప్లకార్డులు చేతబట్టారు.

floyd protests photos
స్వీడన్​లో ఆందోళన

బాంబులు విసిరిన ఆందోళనకారులు

గ్రీస్​లోని ఏథెన్స్​లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. అమెరికా దౌత్య కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లిన ఆందోళనకారులు... ఫైర్​బాంబులను విసిరినట్లు రాయిటర్స్​ వార్తా సంస్థ పేర్కొంది. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఫ్లాయిడ్ మరణం క్షమించరానిది: ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.