ETV Bharat / international

జైలులో గ్యాంగ్​ వార్​.. 24 మంది ఖైదీలు మృతి! - ఈక్వెడార్ న్యూస్​

ఖైదీల మధ్య వివాదం హింసాత్మకంగా(prison riots) మారింది. బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకోవటం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన ఈక్వెడార్​లోని గుయాక్విల్​ ప్రాంతీయ జైలులో(ecuador prison riots 2021) జరిగింది.

Gang clash at Ecuador prison
జైలులో గ్యాంగ్​ వార్
author img

By

Published : Sep 29, 2021, 7:49 AM IST

ఈక్వెడార్​ తీర ప్రాంత నగరం గుయాక్విల్​లోని జైలులో ఘర్షణ(Ecuador prison riots 2021) తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Gang clash at Ecuador prison
గుయాక్విల్​ ప్రాంతీయ జైలు

గుయాక్విల్​ ప్రాంతీయ జైలులో(Ecuador prison riots ) జరిగిన అల్లర్లను(prison riots) అదుపు చేసేందుకు సుమారు 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇందు కోసం పోలీసులతో పాటు సైన్యం రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

Gang clash at Ecuador prison
జైలు ముందు భారీ భద్రత ఏర్పాటు

" లాస్​ లోబోస్​, లాస్​ చోనేరోస్​ గ్యాంగ్​ల మధ్య ఘర్షణ జరిగింది. తుపాకులు, కత్తులు, పేలుడు పదార్థాలు వినియోగించారు. "

- ఈక్వెడార్​ జైళ్ల శాఖ

ఈ ఘర్షణలో ఓవైపు.. భారీ పేలుళ్లు, దట్టమైన పొగ వస్తున్న క్రమంలో రెండు గ్యాంగులు జైలు గదుల కిటికీల్లోంచి తుపాకులతో కాల్పులు జరిపినట్లు పలు మీడియా సంస్థలు ఫొటోలు ప్రచురించాయి. జైలులో ఘర్షణ తలెత్తిన క్రమంలో ఆరుగురు వంటవారిని జైలు నుంచి కాపాడినట్లు గుయాక్విల్​ రాష్ట్రప్రభుత్వం పలు ఫొటోలు ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

Gang clash at Ecuador prison
జైలులోపల పేలుళ్లతో వెలువడుతున్న పొగ
Gang clash at Ecuador prison
జైలు పైకప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న ఖైదీలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలోని మూడు జైళ్లలో అల్లర్లు చెలరేగి 79 మంది ఖైదీలు మరణించారు. ఈ క్రమంలో జులైలో కారాగారాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అధ్యక్షుడు గిల్లెర్మో లాసో.

ఇదీ చూడండి: ఖైదీల మధ్య ఘర్షణ- 18 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.