ETV Bharat / international

వాషింగ్టన్​లో మహాత్ముని విగ్రహం ధ్వంసం

author img

By

Published : Jun 4, 2020, 8:01 AM IST

Updated : Jun 4, 2020, 12:34 PM IST

అమెరికా వాషింగ్టన్​లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు . ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు దర్యాప్తు చేపట్టారు.

US: Mahatma Gandhi's statue outside Indian Embassy desecrated by Black Lives Matter protesters
మహాత్ముని విగ్రహానికి అమెరికాలో అగౌరవం

అమెరికా వాషింగ్టన్​లోని భారత రాయభార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహంపై రంగులు చల్లి అగౌరవ పరిచారు. ఈవిషయంపై భారత అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే వాషింగ్టన్​లోని గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వారం రోజులుగా జరుగుతున్న నిరసనల్లో పలు చారిత్రక, పవిత్ర ప్రదేశాలను కూడా ధ్వసం చేశారు ఆందోళనకారులు. లింకన్​ స్మారకం, ప్రసిద్ధ చర్చిలో విధ్వంసం సృష్టించారు.

వాషింగ్టన్లో ధ్వంసమైన గాంధీ విగ్రహాన్ని దివంగత నేత, భారత మాజీ ప్రధాని 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్​ క్లింటన్​ సమక్షంలో అంకితం చేశారు.

భారత రాయబార కార్యాలయం వెబ్​సైట్లో వివరాల ప్రకారం గాంధీ విగ్రహాన్ని కాంస్యంతో చేశారు. 8 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటుంది. భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య దీనిని బహూకరించింది. విగ్రహం బరువు 16 టన్నులు.

ఈ ఘటనపై భారత్​లో అమెరికా రాయబారి కెన్​ జస్టర్​ క్షమాపణలు చెప్పారు. మహాత్ముని విగ్రహానికి ఇలా జరిగి ఉండకూడదన్నారు.

Last Updated : Jun 4, 2020, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.