ETV Bharat / international

వైరల్: నీటి అడుగున అనకొండ సరదా ఆటలు

ఒక పెద్ద అనకొండ నీటి అడుగు భాగాన ఆనందిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. భారీ, గంభీర జీవి అయినప్పటికీ సరదాగా ఆడుకుంటూ సమయాన్ని గడుపుతోన్న అనకొండ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ANAKONDA
అనకొండ
author img

By

Published : Jul 24, 2021, 12:28 PM IST

పాములు నీటిలో తేలియాడటం మామూలే. కానీ అనకొండ నీటిలో మునిగి హాయిగా.. సేదతీరడం మీరెప్పుడైనా చూశారా? అనకొండ ఏంటీ..? సరదాగా ఎంజాయ్ చేయడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయాల్సిందే.!

వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ సాహసాలు చేసే బ్రియాన్ బార్జిక్ అనే జంతు ప్రేమికుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్​ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ వ్యూస్​తో దూసుకెళ్తోంది. పాముల సంరక్షణ కేంద్రం(రెప్టోరియం)లో ఉన్న ఈ పసుపు పచ్చని అనకొండ పేరు 'ఐవీ' అని ఆయన తెలిపారు.

అదిరిపోయే కామెంట్లు..

నీటిలో పైకి కిందకు తేలుతూ ఆనందంగా బుడగలు వదులుతున్న ఐవీ అనే ఈ అనకొండ చేష్టలకు ఫిదా అయిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

  • 'వావ్ ఇది ఎంత పెద్దగా ఉందో.. చిన్నపిల్లలా ఆడుకుంటుంది కదూ' అంటూ ఒకరు కామెంట్ చేశారు.
  • ఇదొక అందమైన జంతువు.. దాని శరీరమంతా గందరగోళంలా చుట్టేసుకుని విహరిస్తోంది అని మరొకరు అన్నారు.
  • 'పాము జాతిలో ఈ తరహా చేష్టలు చాలా అరుదు.. ఇదొక అద్భుతం' అని ఒకరు.. ఐవీ నీ రంగు సూపర్ అంటూ మరొకరు అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.