అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన క్లబ్ తాత్కాలికంగా ముతపడింది. ఫ్లోరిడా పామ్ బీచ్‌లో ఉన్న 'మార్-ఎ-లాగో' క్లబ్‌ను కరోనా వ్యాప్తి కారణంగా మూసేశారు. ఈ విషయాన్ని క్లబ్ రిసెప్షనిస్ట్ ధ్రువీకరించారు. తదుపరి ప్రకటన జారీ చేసేంత వరకు క్లబ్ మూసే ఉంటుందని తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే క్లబ్‌లోని పలు కార్యకలాపాలను నిలిపివేసినట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించినట్లు వెల్లడించారు. క్లబ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై వైద్యాధికారులు, ట్రంప్ ప్రతినిధులు స్పందించలేదు.
అమెరికా అధ్యక్షుడిగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ట్రంప్ ఇదే క్లబ్‌కు వచ్చారు. కొన్ని వారాల పాటు ఇక్కడే గడిపారు. గోల్ఫ్ ఆడటం, స్నేహితులతో కలిసి డిన్నర్లు చేయడం, రిపబ్లికన్ పార్టీ నేతలతో సమావేశాలు కావడం వంటి పనులు ఇక్కడి నుంచే చేశారు.
ఇదీ చదవండి: ట్రంప్ విగ్రహానికి 'పంచ్' దెబ్బ..!