ETV Bharat / international

ఎన్నికల్లో అక్రమాలపై​ ట్రంప్​కు బుష్​ ఝలక్​ - జార్జి బుష్ అమెరికా ఎన్నికలు ట్రంప్ బైడెన్

ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత జార్జి డబ్ల్యూ బుష్ స్పందించారు. ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని ప్రజలు నమ్మొచ్చని చెప్పారు. అయితే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించే హక్కు ట్రంప్​కు ఉందని స్పష్టం చేశారు. విజేతలైన జో బైడెన్-కమలా హారిస్​కు అభినందనలు తెలిపారు.

Former US President George W Bush congratulates Biden, Harris
న్యాయబద్ధంగానే అమెరికా ఎన్నికలు: బుష్
author img

By

Published : Nov 9, 2020, 10:43 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని ప్రజలు విశ్వసించవచ్చని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత జార్జి డబ్ల్యూ బుష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితం స్పష్టంగా ఉందని అన్నారు. అయితే ఏదైనా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు, రీకౌంటింగ్ అడిగేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు హక్కు ఉందని చెప్పారు.

అమెరికా ఎన్నికల్లో భారీగా ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు బుష్. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇదో శుభసూచిక అన్నారు.

"మీరు ఎలా ఓటేశారన్న విషయంతో సంబంధం లేదు. మీ ఓటు లెక్కలోకి వస్తుంది. ఈ ఎన్నికలు ప్రాథమికంగా సవ్యంగానే జరిగాయని, సమగ్రత నిలబడిందని, ఫలితం స్పష్టంగా ఉందని అమెరికన్ ప్రజలు విశ్వాసంతో ఉండవచ్చు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో బైడెన్-హారిస్ నుంచి ఉత్తమ పనితీరు కనబర్చడం అవసరం. దేశం కోసం మనందరం కూడా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం మనం ఒక్కతాటిపైకి రావాలి."

-జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా మాజీ అధ్యక్షుడు

అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు ఫోన్​ చేసి అభినందనలు తెలిపారు బుష్​. విజేతగా ప్రకటించిన తర్వాత జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశభక్తి సందేశాన్ని ఇచ్చినందుకు బైడెన్​కు ధన్యవాదాలు తెలిపారు.

"డెమొక్రటిక్ పార్టీ నుంచి గెలుపొందినా.. అమెరికన్లందరితో సమానంగా వ్యవహరిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పునరుద్ఘాటించారు. అధ్యక్షులు ట్రంప్, ఒబామాకు నేను ఏ హామీ ఇచ్చానో అదే ఆయనకు ఇస్తున్నాను. అవసరమైనప్పుడు ఏ విధంగానైనా సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయన విజయాలు సాధించాలని నేను ప్రార్థిస్తాను."

బైడెన్, బుష్ ఇదివరకు పలు విషయాల్లో కలిసి పనిచేశారు. బుష్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ఛైర్మన్​గా ఉన్న బైడెన్.. భారత్-అమెరికా సివిల్ న్యూక్లియర్ ఒప్పందంపై సహకారం అందిపుచ్చుకున్నారు.

కమలా హారిస్​కు అభినందనలు చెప్పారు బుష్. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులకూ శుభాకాంక్షలు తెలిపారు.

"7 కోట్లకు పైగా ఓట్లను ఆయన(ట్రంప్) సాధించారు. రాజకీయాల్లో ఇదో చారిత్రక విజయం. ఎన్నికైన రిపబ్లికన్ల ద్వారా ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలో వారి గళం వినిపిస్తుంది."

-జార్జి బుష్, అమెరికా మాజీ అధ్యక్షుడు

బుష్ స్పందనతో ప్రస్తుతం జీవించి ఉన్న అమెరికన్ అధ్యక్షులందరూ బైడెన్​కు శుభాకాంక్షలు తెలిపినట్లయింది. ఇప్పటికే జిమ్మి కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా.. బైడెన్-హారిస్​కు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి- అధ్యక్షుడిగా బైడెన్​ ముందున్న సవాళ్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.