మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ గత మంగళవారం దక్షిణ కాలిఫోర్నియా ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అయిదు రోజుల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జి అయ్యారు. 'గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంతో మెరుగైంది. అంతా సవ్యంగా సాగుతోంది" అని క్లింటన్ అధికార ప్రతినిధి ఏంజెల్ యురేనా ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆసుపత్రిలో భార్య హిల్లరీ క్లింటన్, కుమార్తె ఛెల్సియా వెంట ఉన్నారు. "క్లింటన్‌తో మాట్లాడాను. ఆయన బాగున్నారు" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. 15 ఏళ్ల క్లింటన్ 2001లో అధ్యక్షుడిగా పదవీ విరమణ చేశాక తరచూ ఆరోగ్యపరమైన సమన్యలు ఎదుర్కొంటున్నారు. 2004లో బైపాస్ సర్జరీ ఆ మరుసటి ఏడాది ఊపిరితిత్తుల శస్త్రచికిత్స జరిగాయి. 2010లో రెండు స్టెంట్లు వేశారు.
ఇదీ చదవండి: బిల్‌క్లింటన్‌కు అనారోగ్యం- ఆస్పత్రికి తరలింపు