అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ నిర్ధరణకు సామూహిక పరీక్షలు నిర్వహించేందుకు అత్యవసర అనుమతిచ్చింది. ఫలితంగా ఇక నుంచి ఒక్కొక్కరికి కాకుండా ఒకేసారి నలుగురి నమూనాలు పరీక్షించవచ్చు.
ఈ నిర్ణయం ద్వారా తక్కువ పరీక్షలు నిర్వహించి ఎక్కువ కేసులను వేగంగా గుర్తించవచ్చని ఎఫ్డీఏ తెలిపింది. వైద్య పరికరాల వినయోగం కూడా తగ్గుతుందని పేర్కొంది.
సామూహిక పరీక్షల్లో ఒకేసారి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది నమూనాలను పరీక్షిస్తారు. పాజిటివ్ వస్తే ఒక్కొక్కరికి విడిగా మళ్లీ పరీక్షలు చేస్తారు.
కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సామూహిక పరీక్షలు నిర్వహించేలా వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరముందని జూన్ చివర్లో చెప్పారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంథోనీ పౌచీ.
ఇదీ చూడండి: రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టిస్తున్న వైరస్