ETV Bharat / international

'భారత్​లో వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ ఉత్తమం' - భారత్​లో లాక్​డౌన్​ వార్తలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణపై అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ స్పందించారు. దేశాన్ని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయడం ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు.

lockdown, FAUCI
'వైరస్​ కట్టడికి భారత్​లో లాక్​డౌన్​ ఒక్కటే మార్గం'
author img

By

Published : May 1, 2021, 4:49 PM IST

భారత్‌లో కరోనా రెండో దశ కట్టడికి అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం సహా చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితులపై సమగ్ర పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కాగానే చైనా కూడా ఇదే చర్య చేపట్టిందని పేర్కొన్నారు.

" లాక్​డౌన్​ విధించడానికి ఎవరూ సుముఖత చూపించరు. కానీ ప్రస్తుతం భారత్​లో పరిస్థితి అదుపులోకి రావాలంటే అదొక్కటే మార్గం. దీనిని నెలల పాటు విధించాల్సిన అవసరం లేదు. కొద్ది వారాలు అమలు చేస్తే చాలు. వైరస్​ను కట్టడి చేసేందుకు తక్షణం చేపట్టే చర్యలు, దీర్ఘకాలంలో చేపట్టేవి ఉంటాయి. లాక్​డౌన్​ విధించడం సహా ఆక్సిజన్​, పీపీఈ కిట్లు వంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం తక్షణం చేపట్టాల్సిన చర్యలు. కరోనాపై విజయం సాధించామని ప్రభుత్వాలు భావించాయి. 139 కోట్ల జనాభాలో ఇప్పటివరకు కేవలం 2 శాతం మందికే టీకాలు అందాయి."

-ఆంటోనీ ఫౌచీ, అమెరికా వైద్య సలహాదారు

ఇంకా తీవ్రరూపం దాల్చలేదు..
భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదని అమెరికా అధికారులు హెచ్చరించారు. భారత్​కు ఆక్సిజన్​​, వ్యాక్సిన్​ తయారీకి సంబంధిన పరికరాల పంపిణీ సహా వైద్య రంగంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించామని.. అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

తాత్కాలిక రాయబారి..
ప్రస్తుతం దేశంలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఖాళీగా ఉన్న రాయబారి పదవిని భర్తీ చేసేందుకు అగ్రరాజ్యం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక రాయబారిగా డేనియల్​​ స్మిత్​ను నియమించనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. మహమ్మారిపై పోరాడడం సహా ఇరు దేశాల బంధం మరింత బలపడేందుకు స్మిత్​ కృషి చేస్తారని పేర్కొంది.

ఇదీ చూడండి: అమెరికాలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.