అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌లకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలన్నారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బైడెన్ పూర్తి రక్షణతో జనవరిలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఫాచీ పేర్కొన్నారు.
అదేమాదిరిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్లకూ టీకా వేయాలని సూచించారు ఫాచీ. ఇప్పటికే కరోనా బారిన పడిన ట్రంప్ శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ.. మరింత సురక్షితంగా ఉండేందుకు వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు.
ఇదీ చూడండి: 'గాంధీ విగ్రహ అపవిత్రం అత్యంత దారుణం'