కౌగిలింతలన్నింటిలోనూ తనయుడిని హత్తుకున్నప్పుడు కలిగే అనుభూతి మరే ఇతర వాటిలోనూ దొరకదని చాలా మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతటి భావోద్వేగాన్ని కలగజేస్తుంది ఆ హగ్. ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. ఓ సైనికుడు సెలవులకి ఇంటికొచ్చాడు. తైక్వాండో తరగతులకెళ్లిన కుమారుడి వద్దకు వెళ్లి ఆశ్చర్యపరిచాడు. భావోద్వేగంతో కూడిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
I’m not crying, you’re crying 😭 pic.twitter.com/D7ZRCaJT6L
— Athlete Swag (@AthleteSwag) March 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’m not crying, you’re crying 😭 pic.twitter.com/D7ZRCaJT6L
— Athlete Swag (@AthleteSwag) March 20, 2019I’m not crying, you’re crying 😭 pic.twitter.com/D7ZRCaJT6L
— Athlete Swag (@AthleteSwag) March 20, 2019
అమెరికాకు చెందిన రాబ్ సెస్టెర్నినో విదేశాల్లో విధులు ముగించుకుని స్వదేశానికి వచ్చాడు. అతని 9ఏళ్ల కుమారుడు లూకా సెస్టిర్నో తైక్వాండో తరగతులకు వెళ్లాడు. కళ్లకు గంతలు కట్టుకుని గురువుతో కలిసి సాధన చేస్తున్నాడు పిల్లాడు. కుమారుడి వద్దకెళ్లిన రాబ్.. గ్లౌజ్ తొడుక్కుని లూకాతో జతకలుస్తాడు. సాధనలో నిమగ్నమైన పిల్లాడు... వచ్చింది తండ్రి అని తెలియక పంచ్‌ల వర్షం కురిపిస్తాడు. అలా కాదు, ఇలా అంటూ రాబ్ ప్రోత్సహిస్తాడు. తండ్రి మాటలు గుర్తుపట్టిన లూకా కళ్లకున్న గంతలు తీసి భావోద్వేగంతో తండ్రిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తాడు. నిన్ను చూసి గర్వపడుతున్నాను అని కుమారుడితో చెప్తూ.. పుత్రోత్సాహంతో పొంగిపోయాడు రాబ్.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషనల్ వీడియో చూసిన నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.