ETV Bharat / international

ఆ కర్కశ పోలీస్‌పై తప్పుడు వార్తలు - Minneapolis officer in fatal arrest news

నల్ల జాతీయుడిని మోకాలుతో నొక్కిపెట్టి అతని మృతికి కారణమైన పోలీసు అధికారిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గత అక్టోబర్​లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో 'మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌' అనే టోపీ ధరించాడంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అది వైరల్‌గా మారి.. ఆందోళనలకు దారి తీసింది.

False news swirls around Minneapolis officer
ఆ కర్కశ పోలీస్‌పై తప్పుడు వార్తలు
author img

By

Published : May 28, 2020, 11:21 AM IST

ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ మెడపై మోకాలు నొక్కిపెట్టి అతని మృతికి కారణమైన పోలీస్‌ అధికారిపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం అతని మృతికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. ఆ తర్వాత అమెరికాలో వివిధ రకాలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ ఘటనలో జార్జ్‌ మృతికి కారణమైన డెరెక్‌ చావిన్‌ గత అక్టోబర్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించిన ర్యాలీలో 'మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌' అనే టోపీ ధరించాడంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అది వైరల్‌గా మారి.. ఆందోళనలకు దారి తీసింది. దీంతో మినియాపొలిస్‌ అధికారులు వాస్తవాలను వెల్లడించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి కారణమైన పోలీసులెవరూ ట్రంప్‌ ర్యాలీలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

అయితే, 'మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌' అనే టోపీ ధరించిన వ్యక్తి ఇంటర్నెట్‌ ట్రోలర్‌ అని, అతని పేరు జొనాథన్‌ లీ రిచెస్‌ అని తేలిందన్నారు. జొనాథన్‌ ఫొటోను.. డెరెక్‌ చావిన్‌గా చిత్రించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టారని అధికారులు స్పష్టంచేశారు. మరోవైపు జొనాథన్‌ ఓ మీడియాకు దీనిపై వివరణ ఇచ్చారు. 'మేక్‌ వైట్స్‌ గ్రేట్‌ అగెయిన్‌' అనే ఫొటోలో ఉంది తానేనని, అయితే.. ఆ టోపీపై ఉన్న కొటేషన్‌ మాత్రం తనది కాదని, ఎవరో కావాలనే మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో డెరెక్‌పై చేస్తున్న విద్వేషపూరిత పోస్టులు నిలిపివేయాలని మినియాపొలిస్‌ అధికారులు కోరారు.

ఇదీ చూడండి: పోలీసు కర్కశం- నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.